iDreamPost

ఐర్లాండ్​తో తొలి మ్యాచ్​.. భారత్​ను భయపెడుతున్న ఆ ముగ్గురు!

  • Published Jun 04, 2024 | 1:41 PMUpdated Jun 04, 2024 | 1:41 PM

టీ20 ప్రపంచ కప్​-2024లో తొలి సమరానికి సిద్ధమవుతోంది టీమిండియా. మొదటి మ్యాచ్​లోనే బోణీ కొట్టాలని చూస్తోంది. ఐర్లాండ్​ను చిత్తు చేసి పాకిస్థాన్​తో మ్యాచ్​కు మరింత ఆత్మవిశ్వాసంతో రెడీ అవ్వాలని అనుకుంటోంది.

టీ20 ప్రపంచ కప్​-2024లో తొలి సమరానికి సిద్ధమవుతోంది టీమిండియా. మొదటి మ్యాచ్​లోనే బోణీ కొట్టాలని చూస్తోంది. ఐర్లాండ్​ను చిత్తు చేసి పాకిస్థాన్​తో మ్యాచ్​కు మరింత ఆత్మవిశ్వాసంతో రెడీ అవ్వాలని అనుకుంటోంది.

  • Published Jun 04, 2024 | 1:41 PMUpdated Jun 04, 2024 | 1:41 PM
ఐర్లాండ్​తో తొలి మ్యాచ్​.. భారత్​ను భయపెడుతున్న ఆ ముగ్గురు!

టీ20 వరల్డ్ కప్-2024 క్రికెట్ లవర్స్​ను అలరిస్తోంది. ఒకదాన్ని మించి మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగుతూ అందరి అటెన్షన్​ను ఇటు వైపు తిప్పేశాయి. రికార్డు ఛేజింగ్​లు, సంచలన బౌలింగ్ ప్రదర్శనలతో మెగా టోర్నీ అందర్నీ ఊపేస్తోంది. ఇప్పటిదాకా యూఎస్​ఏ, కెనడా, ఉగాండా, ఆఫ్ఘానిస్థాన్ లాంటి చిన్న జట్లే ఆడాయి. ఇప్పుడు క్రమంగా బడా టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. భారత జట్టు బుధవారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్​తో పోరుతో వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది రోహిత్ సేన. న్యూయార్క్​లో జరిగే ఈ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. భారత్​కు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ అనుకుంటుండగా.. ఈ మ్యాచ్​లో భారీ విజయం సాధించి పాకిస్థాన్​తో పోరుకు మరింత కాన్ఫిడెన్స్​తో వెళ్లాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు భారత్​ను భయపెడుతున్నారు.

ఐర్లాండ్​తో మ్యాచ్ కదా అని చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. పాకిస్థాన్​తో జరిగే ఫస్ట్ మ్యాచే అసలు పోరాటమని భావిస్తున్నారు. కానీ ఇది టీ20 ఫార్మాట్. ఇక్కడ ఒక్క ఓవర్​లో, ఒక్కోసారి ఒక్క బంతిలో కూడా ఫలితం తారుమారవుతుంది. ఐర్లాండ్​కు బిగ్ టీమ్స్ మీద ఆడటం కొత్త కాదు. ఆ జట్టుకు బ్యాటింగే కొండంత బలం. పసికూన అని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ టీమ్​ బ్యాటర్లు లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టార్ మంచి ఫామ్​లో ఉన్నారు. ఇటీవల పాకిస్థాన్ మీద విధ్వంసక ఇన్నింగ్స్​లతో విరుచుకుపడ్డారు. పాక్​తో సిరీస్​లో రెండో మ్యాచ్​లో టక్కర్ 34 బంతుల్లోనే 51 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్​తో మెరిశాడు. అలాగే మూడో టీ20లో 41 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ సిరీస్​లోని తొలి మ్యాచ్​లో 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు హ్యారీ టెక్టార్. రెండో టీ20 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఆఖరి మ్యాచ్​లో 20 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

టక్కర్, టెక్టార్ మెరుపు వేగంతో పరుగులు చేయడంలో ఆరితేరారు. క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో పరుగులు రాబట్టడం వీరికి అలవాటుగా మారింది. ఈ ఇద్దరికీ తోడు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ కూడా ఉన్నాడు. ఫామ్​లో లేకపోయినా తనదైన రోజున ఎలాంటి బౌలర్లను అయినా చీల్చిచెండాడే సత్తా అతడి సొంతం. ఈ ముగ్గురితో భారత్ జాగ్రత్తగా ఉండాలి. లైట్ తీసుకుంటే మాత్రం రిజల్ట్ తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఒక్క ఓవర్​లో అంతా మారిపోయే టీ20 క్రికెట్​లో ఎవర్నీ తక్కువ అంచనా వేయడానికి లేదు. టక్కర్, టెక్టార్, స్టిర్లింగ్​కు తోడు ఆండ్రీ బాల్బిరైన్ రూపంలో మరో సాలిడ్ బ్యాటర్ ఐర్లాండ్ టీమ్​లో ఉన్నాడు. వీళ్లు ఎలా ఆడతారనేది మన బౌలర్లకు పెద్దగా అంచనా లేదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఔట్ చేసి.. మ్యాచ్​ను చేతిలోకి తీసుకొనేందుకు ప్రయత్నించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి