iDreamPost

ఈ స్విగ్గీ డెలివ‌రీ బాయ్ చెత్త పని! CCTVలో రికార్డు కాకుంటే ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు!

  • Published Apr 12, 2024 | 5:14 PMUpdated Apr 12, 2024 | 5:14 PM

ఇప్పుడు అందరు ఎక్కువగా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్లు పెడుతున్నారు. అయితే, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన కొంతమంది డెలివరీ బాయ్స్ మాత్రం.. కస్టమర్స్ కు షాక్ ఇస్తున్నారు, తాజాగా గురుగ్రామ్ జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడు అందరు ఎక్కువగా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్లు పెడుతున్నారు. అయితే, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన కొంతమంది డెలివరీ బాయ్స్ మాత్రం.. కస్టమర్స్ కు షాక్ ఇస్తున్నారు, తాజాగా గురుగ్రామ్ జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Apr 12, 2024 | 5:14 PMUpdated Apr 12, 2024 | 5:14 PM
ఈ స్విగ్గీ డెలివ‌రీ బాయ్ చెత్త పని! CCTVలో రికార్డు కాకుంటే ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు!

ఇప్పుడు చాలా వరకు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారన్న సంగతి అందరికి తెలుసు. అలాగే ప్రతి నెల ఎంతమంది కస్టమర్స్ ఎక్కువ ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారన్న వివరాలను కూడా నోట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటున్నాయి. అలాగే కొన్ని సార్లు ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్స్ కస్టమర్స్ కు షాక్ ఇస్తున్నారు. కొంతమంది దొంగతనాలకు కూడా పాల్పడిన సంఘటనలను కూడా ఇప్పటివరకు ఎన్నో చూశాము. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెప్పాలంటే ఈ వీడియో ఓ రకంగా ప్రజలకు కొత్త భయాలను క్రియేట్ చేస్తుంది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఓ స్విగ్గి డెలివరీ బాయ్.. ఇంటి ముందు ఉన్న షూస్ ను దొంగలించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఘటన గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఒక ఫుడ్ డెలివరీ బాయ్.. ఇంటి ముందు ఉన్న షూస్ ను దొంగిలించాడు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సిసిటివిలో రికార్డు అయింది. అయితే దీని గురించి మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది కాస్త స్విగ్గి యాజమాన్యం వరకు చేరింది. దానితో వారు తప్పును సరిదిద్దుకున్నారు. ఇక వైరల్ అవుతున్న వీడియోను గమనించినట్లయితే.. అందరిలానే ఈ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి.. కాలింగ్ బెల్ కొట్టాడు. అయితే.. కస్టమర్ లోపలి నుంచి రావడం కాస్త ఆలస్యం అవ్వడంతో.. అతని కన్ను డోర్ ముందున్న షూస్ పైన పడింది. ఇంటి ముందు మూడు జతల షూస్ ఉన్నాయి. కస్టమర్ కూడా వచ్చి నార్మల్ గానే ఫుడ్ తీసుకుని డోర్ వేసేసింది. డెలివరీ బాయ్ కూడా వెంటనే వెళ్లిపోయినట్లు నటించి.. మళ్ళీ తిరిగి పైకి వచ్చాడు. అలా వచ్చి ఒక జత షూస్ ను టవల్ లో చుట్టుకుని వెళ్ళిపోయాడు.

ఇదంతా సీసీటీవీ లో రికార్డు అవ్వడంతో.. ఈ గుట్టు కాస్త బయటపడింది. ఇక ఆ తర్వాత షూస్ దొంగలించిన వ్యక్తిపై.. ఆ కస్టమర్ స్విగ్గి సంస్థకు కంప్లైంట్ ఇచ్చారు. మొదట్లో దీని గురించి స్విగ్గి యాజమాన్యం ఏ మాత్రం స్పందించలేదు. అయితే, ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా దీనిని అత్యధిక సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీనితో ఎట్టకేలకు స్విగ్గి ఈ విషయంపై స్పందించి.. “డెలివరీ పార్ట్‌నర్ల నుంచి తాము సరైన పని తో పాటూ మంచి తనాన్ని కూడా ఆశిస్తున్నామని” అంటూ ప్రకటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి చూస్తున్న నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ తీసుకున్నాం అని రిలాక్స్ అవ్వకుండా.. ఇకనైన కస్టమర్స్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి