iDreamPost

Suryakumar-Rohit: 20 నిమిషాల క్రితమే సర్జరీ.. SKYకు రోహిత్ పై ఎంత ప్రేముందో చూడండి! వీడియో వైరల్..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తనకు ఎంత ప్రేముందో తెలియజెప్పాడు భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తనకు ఎంత ప్రేముందో తెలియజెప్పాడు భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Suryakumar-Rohit: 20 నిమిషాల క్రితమే సర్జరీ.. SKYకు రోహిత్ పై ఎంత ప్రేముందో చూడండి! వీడియో వైరల్..

రోహిత్ శర్మ పేరు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మారుమ్రోగిపోతోంది. ఆఫ్గాన్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో తుఫాన్ సెంచరీతో కదం తొక్కాడు హిట్ మ్యాన్. వరుసగా రెండు మ్యాచ్ ల్లో డకౌట్ గా వెనుదిరిన రోహిత్.. మూడో మ్యాచ్ లో మాత్రం తన విశ్వరూపం చూపించాడు. ఇక అతడి ఆటను చూడాలని ఎవ్వరు కోరుకోరు చెప్పండి. పైగా ఆఫ్గాన్ బౌలర్లపై యుద్దాన్ని ప్రకటించాడు. అయితే రోహిత్ పై తనకు ఎంత ప్రేముందో తెలియజెప్పాడు సూర్యకుమార్ యాదవ్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి హిట్ మ్యాన్ పై ప్రేమను సూర్య ఏ విధంగా చూపాడో ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ ల మధ్య మంచి బాండింగ్ ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే? ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున కలిసి ఆడినప్పుడు ఏర్పడిన స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అదీకాక రోహిత్ సారథ్యంలో సూర్య భాయ్ టీ20ల్లో రాటుదేలాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు టైటిల్స్ రావడంలో.. రోహిత్, సూర్యకుమార్ లది తిరుగులేని పాత్ర. సూర్యకుమార్ లో ఉన్న సత్తాను గుర్తించిన రోహిత్ అతడికి ముంబై ఇండియన్స్ టీమ్ లో తిరుగులేని పాత్రను ఇచ్చాడు. దాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న సూర్య కూడా టీ20ల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూర్యకుమార్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన గాయాకి సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈరోజే ఇండియా-ఆఫ్గాన్ మ్యాచ్ ఉండటంతో.. రోహిత్ బ్యాటింగ్ మిస్ అవుతానని అనుకున్నాడు. కానీ తనకు సర్జరీ జరిగిన 20 నిమిషాలకే అభిమాన ఆటగాడి ఆటను లాప్ టాప్ లో చూస్తూ.. తెగ మురిసిపోయాడు సూర్యకుమార్ యాదవ్. రోహిత్ ఆటను బెడ్ పై నుంచే చూసి నవ్వులు చిందించాడు స్కై. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాడంతో.. నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత అభిమానం ఉంటే.. ఆపరేషన్ అయిన 20 నిమిషాలకే ఇలా చేస్తారు? అంటూ సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరలోనే మీ ఇద్దరిని గ్రౌండ్ లో చూడాలని ఆరాటపడుతున్నాం అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి రోహిత్ పై ఉన్న ప్రేమను చూపించిన సూర్యకుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి