iDreamPost

తిలక్‌ వర్మ వల్లే నేను ఈ ఇన్నింగ్స్‌ ఆడగలిగాను: సూర్యకుమార్‌

  • Published Aug 09, 2023 | 11:14 AMUpdated Aug 09, 2023 | 11:14 AM
  • Published Aug 09, 2023 | 11:14 AMUpdated Aug 09, 2023 | 11:14 AM
తిలక్‌ వర్మ వల్లే నేను ఈ ఇన్నింగ్స్‌ ఆడగలిగాను: సూర్యకుమార్‌

టీమిండియా మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎట్టకేలకు మళ్లీ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. వెస్టిండీస్‌ టూర్‌లో వన్డే సిరీస్‌తో పాటు తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన సూర్య భాయ్‌.. మూడో టీ20లో తన విశ్వరూపం చూపించాడు. ఇదీ కదా సూర్య బ్యాటింగ్‌ అనేలా.. స్టో ట్రాక్‌పై కూడా థండర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేసి దుమ్మురేపాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ చేసుకున్నా.. టీమిండియాను ఒంటిచేత్తో గెలిచిపించాడు. అయితే.. తన ఈ సూపర్‌ ఇన్నింగ్స్‌ క్రెడిట్‌ను టీమిండియా యువ సంచలనం, తెలుగు తేజం తిలక్‌ వర్మకు ఇచ్చాడు.

మ్యాచ్‌ తర్వాత తిలక్‌ వర్మతో సరదాగా చిట్‌చాట్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌, తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో కొత్తగా ఏం చేయలేదు. నాకు అలవాటైన పనినే చేశాడు. ఫ్రీగా ఆడా. అయితే.. తిలక్‌ వర్మ మరో ఎండ్‌లో ఉండటంతో ఒత్తడి లేకుండా మరింత ఫ్రీగా ఆడగలిగాను. అతనికి ముందే చెప్పా.. నువ్వు ఆగు నేను కొడతానని, అలా తిలక్‌ ఇచ్చిన సపోర్ట్‌తో మంచి ఇన్నింగ్స్‌ ఆడాను. అతను మరో ఎండ్‌లో స్ట్రాంగ్‌గా ఉండటం వల్లే ఈ ఇన్నింగ్స్‌ సాధ్యమైందని సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకోచ్చాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో సూర్య 83 పరుగులతో దుమ్ములేపితే.. తిలక్‌ వర్మ సైతం 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, సూర్య అవుటైనా మ్యాచ్‌ను గెలిచించే వరకు క్రీజ్‌లో ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి వెస్టిండీస్‌ 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌(42), కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌(40) పరుగులతో రాణించారు. అలాగే నికోలస్‌ పూరన్‌ సైతం 20 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు జైస్వాల్‌, గిల్‌ దారుణంగా నిరాశపరిచారు.

కానీ, మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ జోడీ టీమిండియాను విజయతీరాలకు నడిపించింది. సూర్య 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టిస్తే.. తిలక్‌ వర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో కెప్టెన్‌ పాండ్యా(20 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా తిలక్‌తో కలిసి మ్యాచ్‌ ముగించాడు. మొత్తం మీద 17.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి టీమిండియా 164 పరుగులు చేసి గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో సూర్య ప్రదర్శన, తిలక్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాపం.. గిల్‌! మొన్నటి వరకు నెక్ట్స్‌ కోహ్లీ అన్నారు.. కానీ, ఇప్పుడు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి