iDreamPost

ఆసీస్ తో టీ20 సిరీస్.. శాంసన్ కు నిరాశ! లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ ప్లేయర్

  • Author Soma Sekhar Updated - 10:33 AM, Tue - 21 November 23

టీమిండియా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కంగారూ టీమ్ తో తలపడనుంది. మరోసారి స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మెుండిచేయి చూపించారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్ లో ఓ యంగ్ ప్లేయర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

టీమిండియా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కంగారూ టీమ్ తో తలపడనుంది. మరోసారి స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మెుండిచేయి చూపించారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్ లో ఓ యంగ్ ప్లేయర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

  • Author Soma Sekhar Updated - 10:33 AM, Tue - 21 November 23
ఆసీస్ తో టీ20 సిరీస్.. శాంసన్ కు నిరాశ! లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ ప్లేయర్

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి బాధను మర్చిపోకముందే.. మరోసారి ఆసీస్ తో పోరుకు సిద్దమవుతోంది టీమిండియా. 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కంగారూ టీమ్ తో తలపడనుంది. నవంబర్ 23 నుంచి ప్రారంభం అయ్యే ఈ సిరీస్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఎప్పటిలాగే మరోసారి స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మెుండిచేయి చూపించారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్ లో ఓ యంగ్ ప్లేయర్ లక్కీ ఛాన్స్ కొట్టేసి.. ఏకంగా వైస్ కెప్టెన్ పదవిని చేపట్టాడు. సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చిన ఈ సిరీస్ కు ఎవరెవరిని ఎంపిక చేశారో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మరో సిరీస్ కోసం సమయాత్తం అవుతోంది టీమిండియా. ఆసీస్ తో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). సోమవారం రాత్రి కంగారూ టీమ్ తో తలపడేందుకు 15 మందితో కూడిన జట్టు సభ్యులను ప్రకటించింది. ఇక ఈ సిరీస్ కు అందరూ అనుకున్నట్లుగానే టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే వైస్ కెప్టెన్ గా నియమించబడి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్. తొలి మూడు మ్యాచ్ లకు రుతురాజ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని, మిగిలిన రెండు మ్యాచ్ లకు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చి.. వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడతాడని తెలిపింది బీసీసీఐ.

దేశవాళీ క్రికెట్లో హార్డ్ హిట్టర్ గా పేరుగాంచిన జితేశ్ శర్మకు జాతీయ జట్టును నుంచి పిలుపొచ్చింది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. టోటల్ గా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చి వారి సత్తాను పరీక్షించనుంది. తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో ఆడిన ఇద్దరు మాత్రమే ఈ టీ20 సిరీస్ కు ఎంపిక కాగా.. మిగతా వారందరూ యంగ్ ప్లేయర్లే. ఐపీఎల్ ద్వారా వరల్డ్ క్లాస్ మ్యాచ్ ఫినిషర్ గా పేరుగాంచిన రింకూ సింగ్ కు సెలక్టర్లు తుది జట్టులో చోటు కల్పించారు. కాగా.. ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న కేరళ బాయ్ సంజూ శాంసన్ కు మాత్రం మరోసారి సెలక్టర్ల నుంచి నిరాశే ఎదురైంది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

ఆసీస్ తో తలపడే భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాసింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్.

ఆస్ట్రేలియా జట్టు:

మథ్యూ వేడ్(కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మాథ్యూ షార్ట్, జాస్ ఇంగ్లీస్, స్టోయినీస్, బెరన్ డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, తన్వీర్ సంఘా, సీన్ అబ్బాట్, స్పెన్సర్ జాన్సన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి