iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లకు అనుకూలంగా దేశ సర్వోత్తమ న్యాయస్థానం తీర్పునిచ్చింది. స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల జీవోపై స్టే విధించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది.

ఈ పిటిషన్‌పై 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంతవరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 17 స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జీవో 176ని జారీ చేసిన సంగతి తెలిసిందే.

రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై పిటిషనర్లు మొదట హైకోర్టు ను ఆశ్రయించగా వాటిని తోసిపుచ్చుతూ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ నెల 17న జారీ కావాల్సిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడినట్లయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి