iDreamPost

నాన్న గురించి ఈ విషయం ఎవరికీ తెలియదు.. కృష్ణను తలచుకొని మంజుల ఎమోషనల్!

  • Author singhj Published - 03:06 PM, Wed - 15 November 23

సూపర్​స్టార్ కృష్ణను తలచుకొని ఆయన కూతురు మంజుల ఎమోషనల్ అయ్యారు. నాన్న గురించి ఎవరికీ తెలియని ఓ విషయం ఉందని నెట్టింట్ పెట్టిన పోస్టులో ఆమె రాసుకొచ్చారు.

సూపర్​స్టార్ కృష్ణను తలచుకొని ఆయన కూతురు మంజుల ఎమోషనల్ అయ్యారు. నాన్న గురించి ఎవరికీ తెలియని ఓ విషయం ఉందని నెట్టింట్ పెట్టిన పోస్టులో ఆమె రాసుకొచ్చారు.

  • Author singhj Published - 03:06 PM, Wed - 15 November 23
నాన్న గురించి ఈ విషయం ఎవరికీ తెలియదు.. కృష్ణను తలచుకొని మంజుల ఎమోషనల్!

కుటుంబంలోని ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీలోని మిగతా వారికి ఉండే దు:ఖం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులోనూ కుటుంబ పెద్ద కానరాని లోకాలకు వెళ్లిపోతే తట్టుకోవడం చాలా కష్టం. అదే ఫ్యామిలీలో ఒకే ఏడాదిలో ముగ్గురు వ్యక్తులు మరణిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో కూడా చెప్పలేం. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబం కళ్లారా చూసింది. ఈ స్టార్ ఫ్యామిలీకి 2022 అనేది ఓ పీడ కలగా ఉంటుంది. ఆ ఏడాది రమేష్ బాబుతో పాటు ఇందిరా దేవి, సూపర్ స్టార్ కృష్ణ స్వర్గస్తులయ్యారు. వందలాది సినిమాల్లో హీరోగా నటించి టాలీవుడ్​లో ఎన్నో సంచలనాలకు తెరలేపిన కృష్ణ 2022, నవంబర్ 15వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. దీంతో ఘట్టమనేని కుటంబంతో పాటు అభిమానులు ఆయన్ను తలచుకుంటున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్దంతి సందర్భంగా ఘట్టమనేని మంజుల సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. తండ్రిని తలచుకుంటూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ‘డియర్ నాన్నా.. మీరు మమ్మల్ని వదిలి వెళ్లి సంవత్సరం అవుతోంది. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. కానీ మీరు అనుక్షణం మా పక్కనే ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. మేమంతా మీ ఇంట్లోనే ఉంటున్నాం. షూటింగ్​కు వెళ్లినా, హండ్రెడ్ డేస్ ఫంక్షన్​లో ఉన్నా, ఎక్కడైనా ఔట్​డోర్ షూట్​కు వెళ్లినా మీరు వెంటనే ఇంటికి వచ్చేస్తుంటారు. మళ్లీ వెంటనే నార్మల్ లైఫ్​లోకి వస్తారు. ఎన్ని పనులున్నా ఏదో ఒక విధంగా అందరికీ అందుబాటులోనే ఉండేవారు. అన్ని బాధ్యతలను మీరు నిర్వర్తించేవారు. ఎప్పుడూ ప్రెజెంట్​లోనే ఉండేవారు. మీ కెరీర్​లో మీరెన్నో అద్భుతాలు చేశారు. అలాగే మీ పర్సనల్ లైఫ్​లోనూ చాలా వండర్స్ చేశారని ఈ ప్రపంచానికి తెలియదు’ అని మంజుల ఎమోషనల్ అయ్యారు.

కృష్ణ మనసు ఎప్పుడూ ఇంటి మీద, కుటుంబ సభ్యుల మీదే ఉండేదని తన పోస్ట్​లో రాసుకొచ్చారు మంజుల. లవ్​యూ నాన్నా.. మీ ప్రేమను నేనెప్పటికీ ఫీలవుతూనే ఉంటానంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇక, సిల్వర్ స్క్రీన్​ మీద కృష్ణ చేసిన ప్రయోగాల గురించి తెలిసిందే. ఎంతో డేరింగ్ డాషింగ్​గా మూవీస్ తీసి విజయాన్ని సాధించారు. టాలీవుడ్​ను నెక్స్ట్ లెవల్​లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన ఎక్స్​పెరిమెంట్స్, వండర్స్ ఇప్పటి జనరేషన్​కు ఇన్​స్పిరేషన్ అనే చెప్పాలి. ఇక, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం విదితమే. ఈ ఫిల్మ్​ను వచ్చే సంక్రాంతికి బరిలో నిలిపేందుకు ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు. ‘గుంటూరు కారం’కు సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయితే దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవ్వనున్నారు మహేష్.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ తర్వాత రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌: కోచ్‌

 

View this post on Instagram

 

A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి