iDreamPost

Rajinikanth: రజనీకాంత్‌పై వృద్ధురాలు ఆగ్రహం.. అంత ప్రేమ ఉంటే..!

  • Published Jan 17, 2024 | 12:24 PMUpdated Jan 17, 2024 | 12:24 PM

తమ అభిమాన సెలెబ్రిటీలను చూసేందుకు ఫ్యాన్స్ ఆ తారల ఇళ్ల ముందు సందడి చేయడం సహజం. అయితే, ఈ సందడి ఆ తారల ఇరుగుపొరుగు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని.. ఓ పెద్దావిడ స్టార్ హీరోపై మండిపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

తమ అభిమాన సెలెబ్రిటీలను చూసేందుకు ఫ్యాన్స్ ఆ తారల ఇళ్ల ముందు సందడి చేయడం సహజం. అయితే, ఈ సందడి ఆ తారల ఇరుగుపొరుగు వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని.. ఓ పెద్దావిడ స్టార్ హీరోపై మండిపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

  • Published Jan 17, 2024 | 12:24 PMUpdated Jan 17, 2024 | 12:24 PM
Rajinikanth: రజనీకాంత్‌పై వృద్ధురాలు ఆగ్రహం.. అంత ప్రేమ ఉంటే..!

సాధారణంగా సెలబ్రిటీస్ ఇళ్ల ముందు వారి అభిమానులు బారులు తీరడం సహజం. ప్రత్యేక రోజుల్లో అయితే ఈ హడావిడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వారి అభిమాన హీరోను తమ కళ్లారా చూడడం కోసం ఎంతో తపిస్తూ ఉంటారు. ఒక్కసారి వారు కనపడగానే ఆనందంతో కేకలు వేస్తూ ఉంటారు. అయితే, అభిమానులు చేసే హడావిడి సెలబ్రిటీస్ ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటుందట. తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇంటి పొరుగున ఉండే ఓ పెద్దావిడ.. ఈ విషయమై రజనీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది.

సూపర్ స్టార్ రజని కాంత్ కు దేశమంతటా ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఇక తమిళనాట గురించైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంత మంది అభిమానులను సొంతం చేసుకోవడం కేవలం తలైవకే సాధ్యం. అయితే, రజని కాంత్ ను ప్రత్యేక్షంగా చూడడానికి ఎంతో మంది అభిమానులు.. సూపర్ స్టార్ ఇంటి బయట బారులు తీరుతూ ఉంటారు. ఇక రజని పుట్టిన రోజు, పండుగలు ఇలాంటి ప్రత్యేక రోజుల్లో అయితే.. వారి ఇంటి ముందు అభిమానుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. రజని కూడా ఆయన అభిమానులను నిరాశ పరచకుండా.. బయటకు వచ్చి అందరికి కనిపించి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన సంక్రాంతి పండుగ సంధర్బంగా.. చెన్నైలోని పోయెస్‌ గార్డ్‌లో సూపర్ స్టార్ ఇంటి ముందు కొన్ని వేలమంది అభిమానులు పోగయ్యారు. దీంతో ఎప్పటిలాగానే రజనీ బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను అని చెప్పారు. అందరు నిబద్ధత, నిజాయతీతో నడుచుకోవాలని, అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుందని అభిమానులకు సూచించారు. దీనితో సూపర్ స్టార్ ఇంటి ముందు పండుగ రోజున సందడి వాతావరణం కనిపించింది. అయితే, ఈ సందడి వాతావరణమే రజిని ఇంటి పక్కన ఉండే ఓ పెద్దావిడకు కాస్త కష్టంగా అనిపించిందట.

సూపర్ స్టార్ అభిమానులు.. ఆయనని చూసిన ఆనందంలో ‘తలైవ’ ‘తలైవ’ అంటూ అరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ ఇంటి పక్కన ఉండే పెద్దావిడ ఈ విధంగా మాట్లాడారు. “ఇదేం లొల్లి.. ప్రశాంతంగా పండగను కూడా సెలబ్రేట్‌ చేసుకోనివ్వరా” అంటూ సీరియస్ అయ్యారు. అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది, అభిమానులతో వాగ్వాదానికి దిగారు. “ఏం మీ ఇంటి ద్వారాలు తెరిచి వారిని లోనికి పిలిపించుకోవచ్చుగా. మేం కూడా ఇంటి పన్ను కడుతున్నాం. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అభిమానులు ఇలా మా ఇంటి ముందు నిలబడి కేకలు వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రశాంతంగా దేవుడిని కూడా ప్రార్థించలేకపోతున్నాం” అంటూ మండిపడ్డారు. దీనితో సందడి వాతావరణం కాస్త దెబ్బతింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి