iDreamPost

Super Machi : మెగాల్లుడి సినిమా ఇంత సైలెంట్ గానా

Super Machi : మెగాల్లుడి సినిమా ఇంత సైలెంట్ గానా

ఎల్లుండి విడుదల కాబోతున్న సూపర్ మచ్చి మీద కొంచెం కూడా బజ్ లేదు. మినిమమ్ ప్రమోషన్ల జాడ లేదు. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ అది కూడా రొటీన్ ఫార్మట్ లోనే కనిపిస్తోంది. కనిపించకుండా హీరోని ప్రేమించే హీరోయిన్, అతని వెనుకో రహస్యం, దాని తాలూకు ఫ్లాష్ బ్యాక్, ఫాదర్ సెంటిమెంట్, అజయ్ లాంటి ఓ బిల్డప్ ఇచ్చే విలన్ వెరసి దర్శకుడు పులి వాసు కొత్తగా ఏమి ట్రై చేసినట్టు కనిపించలేదు. పైపెచ్చు కళ్యాణ్ దేవ్ ని మాస్ హీరోగా చూపించాలన్న తాపత్రయం మాత్రం బాగా కనిపించింది. హీరోయిన్ రుచిత రామ్ లుక్స్ ఆకర్షణీయంగా లేకపోగా ఇంకెవరు దొరక్క తనని తీసుకొచ్చిన ఇంప్రెషన్ కలుగుతోంది.

మొత్తానికి సంక్రాంతి రేస్ లో వీక్ గా కనిపిస్తోంది ఈ సూపర్ మచ్చినే. 14న బంగార్రాజు, రౌడీ బాయ్స్ తో పోటీ ఉన్నా కూడా మేకర్స్ ఎందుకింత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇక మెగా సపోర్ట్ కూడా దీనికి జీరో. స్వంత మావయ్య చిరంజీవి ఇప్పటిదాకా ట్రైలర్ ని షేర్ చేయలేదు. నాగబాబు దీని ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. పోనీ కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ ఏమైనా మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడ్డం లాంటివి చేస్తున్నారా అంటే అదీ లేదు. రిలీజ్ చూస్తుంటే మొక్కుబడి వ్యవహారంలా కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల కోసమైనా ఏదో ఒకటి చేస్తే బాగుండేది

అసలే కరోనా భయాలు మెల్లగా పెరుగుతున్నాయి. జనం థియేటర్ కు రావాలంటే బలమైన కంటెంట్ ఉన్న అభిప్రాయం ట్రైలర్లు పబ్లిసిటీ మెటీరియల్ లో కనిపించాలి. కానీ సూపర్ మచ్చిలో అవన్నీ మిస్ అవుతున్నాయి. అదే హీరో మరో సినిమా కిన్నెరసాని ఈ నెల 26 వస్తోంది. అంతో ఇంతో బజ్ దాని మీదే ఉంది. మొత్తానికి ఇలా ఎవరూ పట్టించుకోకపోతే రేపు ప్రేక్షకులు కూడా అదే పని చేస్తారు. ఓమిక్రాన్ దెబ్బకు అడ్వాన్స్ బుకింగ్స్ బిసి సెంటర్స్ లో చాలా నెమ్మదిగా ఉన్నాయి. బంగార్రాజు ఒకటే బెటర్ గా నడుస్తోంది. రౌడీ బాయ్స్, హీరో టికెట్లను ముందుగా కొనే ఊపు కనిపించడం లేదు. ఇక సూపర్ మచ్చి సంగతేంటో మరి

Also Read : Special Shows : పాత సినిమాల ప్రీమియర్లు – అభిమానుల సంబరాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి