iDreamPost

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే!

Summer Holidays 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లోన్ని అన్ని రకాల విద్యా సంస్థలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్‌ 23వ తేదీతో పాఠశాలల పనిదినం ముగిసింది. ఈ సారి మొత్తం ఎన్ని రోజులు సెలవు ఉన్నాయంటే..

Summer Holidays 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లోన్ని అన్ని రకాల విద్యా సంస్థలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్‌ 23వ తేదీతో పాఠశాలల పనిదినం ముగిసింది. ఈ సారి మొత్తం ఎన్ని రోజులు సెలవు ఉన్నాయంటే..

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అదరగొడుతున్నాయి. ఇళ్లలలో నుంచి బయటకు వచ్చేందు జనాలు భయంతో వణికిపోతున్నారు.  రోజు రోజూకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.  ఇది ఇలా ఉంటే ఏటా పాఠశాలలకు, కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటిస్తుంటారు. తాజాగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి విద్యాసంస్థలకు వేసవి  సెలవు మొదలయ్యాయి. ఏప్రిల్‌ 23వ తేదీతో పాఠశాలల పనిదినం ముగిసింది. మరి..మొత్తం ఎన్నిరోజులు వేసవి సెలవు, తిరిగి ఎప్పుడు ప్రారంభం అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రారంభయ్యాయి. అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి సమ్మర్ హాలీ డేస్ ను అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి జూన్ 12వ తేది నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. మొత్తంగా దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. అన్ని రకాల యామాన్య పరిధిలో ఉండే పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ  విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి ప్రారంభం కానుంది. ఏటా మాదిరిగానే వచ్చే విద్యా సంవత్సరం కూడా జూన్‌ 12 తో ప్రారంభం కానుంది. అంటే జూన్ 12వ తేదీ నుంచి ఏపీలో విద్యాసంస్థలు తిరిగి తెరచుకోనున్నాయి.

Summer holidays in Telugu states from today

అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ 23వ తేదీతో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి  విద్యాసంస్థల చివరి పనిదినం ముగిసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు కూడా ఏపీ మాదిరిగానే నేటి నుంచి సమ్మర్ హాలీడ డేస్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇక వేసవి సెలవులు ప్రకటిస్తూనే అధికారులు కీలక ఆదేశాలను జారీ చేశారు. వేసవి సెలవుల్లో రెండు రాష్ట్రాల్లోని ఎవరైనా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెండు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఇటీవల సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ 2 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఆయా పాఠశాలలు మంగళవారమే ప్రకటించారు. దీంతో  సమ్మర్ హాలీ డేస్ ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో మే 31 వరకు ఇంటర్‌ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇచ్చారు. ఫిబ్రవరి 28వ నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సరాల పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి