iDreamPost

చంద్రబాబు- పవన్ పై మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు- పవన్ పై మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు!

తిరుమల తిరుపతి దేవస్థానం, వైవీ సుబ్బారెడ్డి, శ్రీ వాణి ట్రస్టుపై గత కొన్ని రోజులుగా టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వాణి ట్రస్టు శ్వేతపత్రం విడుదల చేయాలని.. తిరుమలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇలాంటి ఆరోపణలపై మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి స్పందించారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఇద్దరూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు. వీళ్లు తిరుమల తిరుపతి దేవస్థానంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వ్యాక్యానించారు. తిరుమలలో ఎక్కడా అన్యమత ప్రచారం జరగడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. టీటీడీపై ఇష్టమొచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కాగ్ ద్వారా ఆడిట్ చేసేందుకు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయాలకే పరిమితమైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మత పరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని సూచించారు.

టీటీడీకి న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే తాను శ్రీ వాణి ట్రస్టు టికెట్ ద్వారా దర్శనం చేసుకుంటానని వెల్లడించారు. టీటీడీని అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.  ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ హిందువులను కించపరిచేలా ప్రవర్తించలేదన్నారు. హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ఆంధ్రజ్యోతిపై తాను వేసిన పరువు నష్టం దావాపై కూడా సుబ్రమణ్య స్వామి స్పందించారు. తన కేసు ప్రస్తుతం అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉందన్నారు. ఇప్పుడు తన వాదనలు వినిపించకుండా ఎవరూ ఆపలేరన్నారు. వంద కోట్ల రూపాయలకు కేసు వేసినట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి