iDreamPost

విశాఖ నుండి దక్షిణ కొరియాకు స్టైరిన్‌ తరలింపు…

విశాఖ నుండి దక్షిణ కొరియాకు స్టైరిన్‌ తరలింపు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర స్టైరిన్‌ గ్యాస్ ఎల్‌ జీ పాలిమర్స్‌ కంపెనీ నుండి లీక్ అవడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్టైరిన్‌ను విశాఖలో ఉంచకూడదని దక్షిణ కొరియాకు తరలించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.

విశాఖలోని ఎల్‌ జీ పాలిమర్స్‌ కంపెనీ ట్యాంకుల్లో 13 వేల టన్నుల స్టైరిన్‌ రసాయనం ఉంది. తరలింపులో భాగంగా 8వేల టన్నుల రసాయనంతో ‘ఎం/టి అర్హ’ అనే నౌక విశాఖ పోర్టు నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరింది. మరో ఐదువేల టన్నుల స్టైరిన్‌ను రెండు మూడు రోజుల్లో ఇంకో నౌకలో దక్షిణ కొరియాకు తరలిస్తామని విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు.

కాగా ఈ నెల మే 7 న విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీనుండి ప్రమాదకర స్టైరిన్‌ గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. కాగా మృతులకు కోటి రూపాయలు, వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్న బాధితులకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు, కంపెనీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటున్న 15000 మందికి పదివేల రూపాయల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మృతులకు కోటి రూపాయలను చెక్ రూపంలో అందజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి