iDreamPost

అమ్మాయిల కోసం గడ్డం పెంచుతున్నారా? ఐతే జాగ్రత్త చిక్కుల్లో పడతారు!

అమ్మాయిల కోసం గడ్డం పెంచుతున్నారా? అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే. ఈ విషయంలో పరిశోధకులు చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

అమ్మాయిల కోసం గడ్డం పెంచుతున్నారా? అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే. ఈ విషయంలో పరిశోధకులు చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

అమ్మాయిల కోసం గడ్డం పెంచుతున్నారా? ఐతే జాగ్రత్త చిక్కుల్లో పడతారు!

గడ్డం పెంచడం అనేది ఇప్పుడొక ట్రెండ్. అమ్మాయిలు ఇష్టపడతారని అదే పనిగా గడ్డం పెంచేవాళ్ళు ఉంటారు. ఈ విషయంలో సినిమా హీరోలని ఫాలో అవుతారు. అమ్మాయిలని ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా గడ్డాన్ని ప్రేమిస్తారు. మగవారికి గడ్డం ఒక ఎమోషన్. పెళ్ళికి ముందు అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నట్టు గడ్డం మీద కూడా విపరీతమైన ప్రేమ పెంచుకుంటారు. ఈ క్రమంలో ఊరి చివర మర్రిచెట్టు ఊడలు పెరిగినట్టు పెంచేవాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే గుబురు గడ్డం ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని నమ్ముతారు. గడ్డం తీసేస్తే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతారు. ఉన్నట్టుండి నాని సినిమాలో చిన్న పిల్లాడిగా మారిపోయినట్టు ఫీలవుతారు. ఎక్కువగా కటౌట్ లు చిన్నగా ఉన్నవారు ఇలా ఫీలవుతారు. గడ్డం ఉంటే పెద్దగా లేకపోతే పిల్లల్లా కనబడతారు. అందుకే చాలా మంది గడ్డం తీయడానికి ఇష్టపడరు. ట్రిమ్మింగ్ అయినా చేసుకుంటారు కానీ షేవింగ్ మాత్రం చేసుకోరు.

ట్రిమ్మింగ్ చేసుకుంటే ఓకే కానీ మరీ ఏడాదికొకసారో.. బాహుబలి ప్రాజెక్టుల రెండేళ్ళకొకసారో అసలు గడ్డమే తీయకుండా ఉంటేనే అసలు సమస్య. క్లీన్ షేవ్ చేసుకునే వారి కంటే కూడా గడ్డం ఉన్న మగవారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారనేది నిజమే. కానీ వాళ్ళ కోసం లైఫ్ ని రిస్క్ లో పెట్టలేము కదా. అదే పనిగా గడ్డం పెంచితే మాత్రం డేంజర్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఆ గుబురు గడ్డంలో బ్యాక్టీరియా పేరుకుపోతుందట. అది కూడా ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కల బొచ్చు మీద ఉండే బ్యాక్టీరియా కంటే కూడా ఎక్కువగా ఉంటుందట. కుక్క బొచ్చు వల్ల గురక, ముక్కులోంచి నీరు కారడం, కళ్ళు ఎర్రబడడం, దగ్గు, స్కిన్ అలర్జీ వంటివి వస్తాయి. అలాంటిది కుక్క బొచ్చులో కంటే కూడా ఎక్కువ బ్యాక్టీరియా మనిషి పెంచుకునే గడ్డంలో ఉంటే ఇంకెన్ని రోగాలు వస్తాయో ఆలోచించుకోండి. స్విట్జర్లాండ్ లోని హిర్స్ లాండెన్ క్లినిక్ వారు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

గడ్డంతో ఉండే మగవారి కంటే కూడా కుక్కలే చాలా శుభ్రంగా ఉంటున్నాయట. ఎంఆర్ఐ మెషీన్స్ ద్వారా కుక్కలు, మగవారి మీద స్టడీ కండక్ట్ చేశారు. కుక్కల వల్ల మనుషులకు ఏదైనా ప్రమాదం ఉందా? లేక కుక్కలని ఎత్తుకునే మగాళ్లు కుక్కల ద్వారా సంక్రమించే వ్యాధులను పొందే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అధ్యయనం చేశారు. ఈ స్టడీ కోసం 18 మంది మగాళ్ల గడ్డం నుంచి స్వాబ్ శాంపిల్స్ ని తీసుకున్నారు. అలానే 30 కుక్కల మెడ నుంచి కొన్ని శాంపిల్స్ ని తీసుకుని పరిశోధన చేశారు. 30 కుక్కల్లో 23 కుక్కలు అధిక సూక్ష్మజీవులను కలిగి ఉంటే.. 18 మంది మగవారు అధిక మొత్తంలో బ్యాక్టీరియా కలిగి ఉన్నారు. నిజానికి 18 మందిలో ఏడుగురుకి అత్యధికంగా హానిచేసే సూక్ష్మజీవులు ఉన్నాయట.

ఇవి వారిని అనారోగ్యానికి గురిచేయడమే కాకుండా ముప్పు కూడా కలిగిస్తుందని పరిశోధనలో తేలింది. స్టడీ కండక్ట్ చేసిన ప్రొఫెసర్ ఆండ్రీస్ గట్జిత్ చెప్పిన వివరాల ప్రకారం.. పెంపుడు కుక్క బొచ్చులో కంటే కూడా ఎక్కువ బ్యాక్టీరియా మగాళ్లు పెంచుకునే గడ్డంలోనే ఉంటుందట. ఈ పరిశోధనలో గడ్డం పెంచుకునే మగాళ్ల కంటే కూడా కుక్కలే శుభ్రంగా ఉంటున్నాయని ఆయన అన్నారు. కాబట్టి స్టైల్ కోసమో.. అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసమో.. మరేదైనా పర్పస్ కోసమో అదే పనిగా గడ్డం పెంచుతున్నట్లైతే కనుక జాగ్రత్త పడండి. లేదంటే లైఫ్ రిస్క్ లో పడుతుంది. మరి మీరు గడ్డం పెంచుతున్నారా? ఒకవేళ పెంచుతున్నట్లైతే మీ పర్పస్ ఏంటి? అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికా? లేక స్టైల్ కోసమా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి