iDreamPost

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!

మార్చి నెల వచ్చేసింది. ఇప్పుడు పరీక్షల సమయం కావడంతో చదువుపై శ్రద్ధ ఎక్కువ పెడుతుంటారు స్టూడెంట్స్. అలాగే సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.

మార్చి నెల వచ్చేసింది. ఇప్పుడు పరీక్షల సమయం కావడంతో చదువుపై శ్రద్ధ ఎక్కువ పెడుతుంటారు స్టూడెంట్స్. అలాగే సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!

రోజూ స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సెలవులు అంటే ఓ సరదా. అందుకే సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అలాగే ఎప్పుడు పండుగలు.. ఏ రోజుల్లో బడులకు హాలీడేస్ వస్తున్నాయో చెక్ చేస్తూ ఉంటారు. ఆ సెలవులు ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని యోచిస్తుంటారు. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మార్చి నెలలో పలు సెలవులు రాబోతున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. హాలీడేస్ ఎప్పుడు.. ఏ రోజుల్లో రాబోతున్నాయో ఓసారి చూసేయండి.

మార్చి నెల వచ్చేసింది. ఇది పరీక్షల కాలం. ప్రతి ఒక్క విద్యార్థిలోనూ టెన్షన్ ఉంటుంది. చదువు, పరీక్షలు అంటూ ఒత్తిడికి గురౌతుంటారు. ఆదివారం , రెండో శనివారం సెలవులు ఉంటాయి. అయితే ఈ నెలలో కూడా ఐదు ఆదివారాలు వస్తున్నాయి. ఇవే కాకుండా వరుసగా మూడు అదనపు సెలవులు రానున్నాయి. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి, 25వ తేదీన హోలీ, మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే హాలీడేస్ ఉంటాయి. అయితే మార్చి 8వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8వ తేదీన రాగా అనగా శుక్రవారం వచ్చింది. ఆ రోజు విద్యార్థులకు సెలవు.

కాగా, మార్చి 9న శనివారం..ఆ రోజు సెకండ్ శాటర్ డే. ఆ రోజు కూడా స్టూడెంట్స్ కు హాలీడే. మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. ఇక వీటితో పాటు మార్చి 25న హోలీ, 29న గుడ్ ఫ్రైడే సెలువులు ఉంటాయి. అలాగే ఏప్రిల్ నెలలో కూడా పలు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 9వ తేదీన ఉగాది, ఏప్రిల్ 11న రంజాన్, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి