iDreamPost

Ashes 2023: బుద్ది మారని స్టీవ్ స్మిత్.. మరోసారి తొండాట! ఛీ సిగ్గులేదా అంటూ ఫ్యాన్స్ ఫైర్..

  • Author Soma Sekhar Published - 03:54 PM, Fri - 30 June 23
  • Author Soma Sekhar Published - 03:54 PM, Fri - 30 June 23
Ashes 2023: బుద్ది మారని స్టీవ్ స్మిత్.. మరోసారి తొండాట! ఛీ సిగ్గులేదా అంటూ ఫ్యాన్స్ ఫైర్..

యాషెస్ సిరీస్ లో భాగంగా.. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. రసవత్తరంగా సాగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరోసారి బజ్ బాల్ క్రికెట్ తో ఆకట్టుకుంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 278/4 స్కోరుతో కొనసాగుతోంది. ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే.. రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ వివాదాస్పదంగా మారింది. దాంతో మరోసారి ఇంగ్లీష్ అభిమానులు స్మిత్ పై, అంపైరింగ్ పై ట్రోలింగ్ మెుదలు పెట్టారు. నువ్వింకా మారవా? అంటూ స్మిత్ ను తిట్టడం మెుదలు పెట్టారు. అసలేం జరిగిందంటే?

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. రెండు జట్లు విజయం కోసం హోరాహోరిగా పోరాడుతున్నాయి. తొలి రోజు పటిష్ట స్థితిలో ఉన్న ఆసీస్ ను రెండో రోజు దెబ్బకొట్టారు ఇంగ్లాండ్ బౌలర్లు. దాంతో 416 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆసీస్. జట్టులో స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ తన కెరీర్ లో 32వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న స్మిత్.. ఫీల్డింగ్ తో మాత్రం తిట్లుతింటున్నాడు. గతంలో ఎన్నో సార్లు చీటింగ్ కు పాల్పడ్డ స్మిత్ యాషెస్ లో ఇంకా ఘోరంగా తొండాట ఆడుతున్నాడు.

రెండో రోజు ఆటలో స్టార్క్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో.. బ్యాక్ వర్డ్ స్వ్కేర్ వద్ద ఉన్న స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు రూట్. అయితే బాల్ గ్రౌండ్ కు తాకిందన్న అనుమానంతో.. అంపైర్లు తుది నిర్ణయంపై థర్డ్ అంపైర్ కు నివేదించారు. పలు మార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్లు దానిని ఔట్ గా ప్రకటించారు. కానీ,రిప్లేలో దానిని చూస్తే.. బాల్ నేలను తాకినట్లు ఉందని, ఔట్ ఇవ్వడం సరికాదని ఇంగ్లాండ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా స్మిత్ ఇలాంటి వివాదాస్పదమైన క్యాచ్ లు పట్టి అప్పీల్ చేసేవాడు. ఎన్నిసార్లు అభిమానులు తిట్టినా.. స్మిత్ ప్రవర్తనలో మార్పు మాత్రం రావట్లేదని క్రికెట్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి