iDreamPost

రాష్ట్ర సరిహద్దులు మూత.. రహదారులపై గోడల నిర్మాణం

రాష్ట్ర సరిహద్దులు మూత.. రహదారులపై గోడల నిర్మాణం

కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో పొరుగు రాష్ట్రం తమిళనాడు సాహస నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తో తమకున్న సరిహద్దులను మూసివేసింది. రహదారులపై గోడలు నిర్మించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాతో తమకు ఉన్న మూడు సరిహద్దు రహదారులపై గోడలు నిర్మించింది. వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చిత్తూరు జిల్లా బోర్డర్ లోని మూడు ప్రాంతాలలో రోడ్లపై అడ్డంగా గోడ నిర్మించారు. ఈ విషయంపై చిత్తూరు జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు1,097 కేసులు నమోదు కాగా అందులో చిత్తూరు జిల్లాలోని 73 కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఒక శ్రీకాళహస్తిలోని 50కి పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,885 గా నమోదయింది. ఇప్పటికే రాష్ట్రంలో 24 మంది వైరస్ కారణంగా మరణించారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీ తో తమకున్న సరిహద్దును గోడ నిర్మించి మూసి వేయడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి