iDreamPost

10వ తరగతి అర్హతతో 75వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఉండబోతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. పది కాదూ వెయ్యి కాదూ.. ఏకంగా 75 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది.

నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఉండబోతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. పది కాదూ వెయ్యి కాదూ.. ఏకంగా 75 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది.

10వ తరగతి అర్హతతో 75వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావాహుల కల నిజం చేస్తూ.. భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. పదో తరగతి పాసైన వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వంద, వెయ్యి అనుకుంటున్నారేమో.. కానే కాదూ ఏకంగా 75 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. శ్రద్ధ పెట్టి చదివితే.. ఉద్యోగం గ్యారెంటీ. ఈ ఉద్యోగం వస్తే తొలి నుండే రూ. 22 వేల నుండి జీతం పొందవచ్చు. ఇంతకు ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుందో తెలుసా..? అదేనండీ సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‍సీ) లో.  భారీ మొత్తంలో జాబ్స్ నోటిఫికేషన్ విడుదలకు సమయం సిద్ధం చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించబోతుంది ఎస్ఎస్‍సీ. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా ఎస్ఎస్‍సీ జీడీ కానిస్టేబుల్ నియమాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

మొత్తం 75,768 ప్రభుత్వ ఉద్యోగాలను విడుదల చేయనుంది సాఫ్ట్ సెలక్షన్ కమిషన్. 10వ తరగతి పాసైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 2023 నాటికి 18 నుండి 23 ఏళ్ల మధ్య వయస్సున్న వారంతా ఈ ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు. సెలక్ట్ అయిన అభ్యర్థుల వేతన శ్రేణి.. రూ. 21,700 నుండి ప్రారంభమై.. రూ. 69, 100 వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 24న ప్రారంభం కానుంది. సుమారు నెల రోజుల పాటు అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్‌లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో పరీక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 20 నుండి మార్చి 12వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉండే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ఈ ఏడాది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలు నిర్వహిస్తోంది ఎస్ఎస్‍సీ నవంబర్ 14 మొదలుకుని డిసెంబర్ 3వ పరీక్షలు జరుగుతున్నాయి.

మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్హత : 10వ తరగతి పాసై ఉండాలి.

వయస్సు :  ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు : మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.. ఇతర అభ్యర్థులకు రూ. 100 రుసుము

వేతన శ్రేణి : రూ.  21,700 నుండి రూ.  69, 100

ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో,  రాత పరీక్షల నిర్వహించి.. ఆ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు : ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి

దరఖాస్తు స్వీకరణ : నవంబర్ 24, 2023,

చివరి తేదీ : డిసెంబర్ 28, 2023

రాత పరీక్ష : ఫిబ్రవరి 20 నుండి ఉండొచ్చు

వివరాలకు ఈ  https://ssc.nic.in/ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి