iDreamPost

కరోనా భయం మధ్య పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

కరోనా భయం మధ్య పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో 10 వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువమంది విద్యార్థులు మాస్కులతోనే పరీక్షకు హాజరవడం విశేషం.

అధికారులు కూడా మాస్కులను,వాటర్ బాటిళ్లను పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. కరోనా కారణంగా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా పరీక్ష కేంద్రాలలో ఒక్కో రూమ్ కి 24 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నారు. జలుబు,దగ్గు,జ్వరం,అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను ప్రత్యేక గదులలో పరీక్ష రాయించేలా అధికారులు ఏర్పాట్లు చేసారు.

ఇదిలా ఉంటే మరో రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. పరీక్షలకు ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యేందుకు అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఆంధ్రాలో మరో కరోనా పాజిటివ్ కేసు బయట పడటంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండుకు చేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి