iDreamPost

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దాంతో ఈనెల 31 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వైరస్ వ్యాపిస్తుందన్న కారణంతో రెండు వారాలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఎంసెట్‌, ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువుతేదీని మరింత పొడిగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈనెల 31 తర్వాత పదవ తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనేది నిర్ణయిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

వాస్తవానికి మార్చి 31 నుండి పదోతరగతి పరీక్షలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లును అధికారులు చేపట్టారు.సోమవారం రాష్ట్ర విద్యా శాఖ పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నా పత్రాలు,OMR షీట్లు,బుక్‌లెట్‌ల రవాణాకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సర చివరి పరీక్ష  వాయిదా పడగా,ఏపీపీఎస్సీ కూడా తాము నిర్వహించే పరీక్షలను వాయిదా వేసింది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి