iDreamPost

పరీక్షల వేళ.. టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ నిబంధన ఎత్తివేత!

పదో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. పరీక్షల వేళ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధనను ఎత్తివేసి విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది.

పదో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. పరీక్షల వేళ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధనను ఎత్తివేసి విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది.

పరీక్షల వేళ.. టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ నిబంధన ఎత్తివేత!

విద్యార్థుల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయినటువంటి పదో తరగతి పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 02 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగనుంది. లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే టెన్త్ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా పరీక్షల వేళ విద్యాశాఖ అధికారులు టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించారు. ఆ నిబంధనను ఎత్తివేశారు. దీంతో విద్యార్థులుకు కాస్త ఊరట కలగనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నేడు ప్రారంభంకానున్నాయి. పది పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సారి పరీక్షలకు నిమిషం నిబంధనను ఎత్తివేశారు అధికారులు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాలు అదనంగా గ్రేస్‌ టైమ్‌ ఇచ్చారు. అంటే ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. గ్రేస్ టైమ్ తో విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించనున్నారు అధికారులు. ఇక ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను మాత్రం అనుమతించరు. ఇక పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు చోటులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు.

10th class exams

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట పేపర్లు, ఇతర పత్రాలను తీసుకెళ్లకూడదని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులను అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక పరీక్షల వేళ టీఎస్ ఆర్టీసీ టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్‌టికెట్‌ చూపించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశాన్నిచ్చింది. ఈ సౌకర్యాన్ని సెలవు రోజుల్లోనూ వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కాంబినేషన్‌ టికెట్‌తో ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి