iDreamPost

రాజమౌళితో నెట్ ఫ్లిక్స్ మెగా ప్లాన్

రాజమౌళితో నెట్ ఫ్లిక్స్ మెగా ప్లాన్

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా జెండా రెపరెపలాడేలా చేసిన దర్శకుడు రాజమౌళితో ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్టు మీడియా టాక్. ఇందులో భాగంగా వెబ్ సిరీస్, మూవీస్ ని పర్యవేక్షించే బాధ్యత ఆయన తీసుకుంటారట. కథకులుగా అధిక భాగం విజయేంద్ర ప్రసాదే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ రజాకార్ల నేపథ్యంలో ఓ సబ్జెక్టుని ఆయన స్టార్ట్ చేశారు. డైరెక్షన్ ఎవరు చేస్తారనేది చెప్పలేదు కానీ కృష్ణవంశీ లేదా ఇంకెవరైనా అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి గాను నెట్ ఫ్లిక్స్ జక్కన్నకు భారీ పారితోషికం ముట్టజెప్పబోతున్నట్టు తెలిసింది. ఎంతనేది ఇంకా బయటికి రాలేదు.

రాజమౌళితో నెట్ ఫ్లిక్స్ బాండింగ్ ఇప్పటిది కాదు. బాహుబలి, ట్రిపులార్ హిందీ వెర్షన్లు ఆ ఓటిటికి కనకవర్షం కురిపించాయి. లక్షలాది సబ్స్క్రైబర్స్ రీచ్ పెరిగేందుకు ఉపయోగపడ్డాయి. ఆ కారణంగానే వేరే డైరెక్టర్స్ తో శివగామి ఆవిర్భావం నుంచి కథను చూపించేలా ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కొంత భాగం షూటింగ్ అయ్యాక రషెస్ నచ్చక దాన్ని మధ్యలోనే వదిలేశారు.

అప్పటి నుంచే ఇద్దరి మధ్య చర్చలు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. తాను దర్శకత్వం చేయకపోయినా తను రికమండ్ చేసే కంటెంట్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించేలా చూసుకోవడం, దగ్గరుండి పర్యవేక్షించడం రాజమౌళి బాధ్యత.

ఎలాగూ మహేష్ బాబు సినిమాకు టైం బోలెడుంది కాబట్టి ఈజీనే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి మహేష్ పది నెలలకు పైగా సమయం తీసుకుంటున్నాడు. ఈలోగా జక్కన్న స్క్రిప్ట్ తో పాటు ఈ నెట్ ఫ్లిక్స్ తాలూకు వ్యవహారాలను చక్కదిద్దవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ అంతర్గతంగా అగ్రిమెంట్ జరిగిందనే అంటున్నారు. అధికారికంగా వచ్చాక మరింత క్లారిటీ రావొచ్చు. ఆర్ఆర్ఆర్ థియేటర్ రన్ పూర్తయినా నెట్ ఫ్లిక్స్ పుణ్యమాని ట్విట్టర్ లో దేశ విదేశాల సెలబ్రిటీలు ట్వీట్లు గుప్పిస్తూనే ఉన్నారు. వంద రోజులు దాటేసినప్పటికీ ఇదింకా ట్రెండింగ్ లో ఉండటం విశేషమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి