iDreamPost

తాను చనిపోతూ.. ఐదుగురికి పునర్జన్మనిచ్చి మహిళా వీఆర్వో!

ఈ భూమ్మీద పుట్టిన మనిషికి మళ్లీ జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఇటీవల కొంతమందికి బ్రెయిన్ డెడ్ కావడంతో వారి అవయవాలు ఇతరులకు దానం చేసి పునర్జీవితం ఇస్తున్నారు.

ఈ భూమ్మీద పుట్టిన మనిషికి మళ్లీ జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఇటీవల కొంతమందికి బ్రెయిన్ డెడ్ కావడంతో వారి అవయవాలు ఇతరులకు దానం చేసి పునర్జీవితం ఇస్తున్నారు.

తాను చనిపోతూ.. ఐదుగురికి పునర్జన్మనిచ్చి మహిళా వీఆర్వో!

మనిషికి మరో జన్మ ఉంటుందో లేదే తెలియదు కానీ.. అవయవదానంతో కొంతమందికి పునర్జన్మ ఇవ్వవొచ్చు. ఇటీవల కొంతమందికి బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకొని బాధితుడి అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల రెండేళ్ల చిన్నారి అవయవదానంతో ముగ్గురు ప్రాణాలు కాపాడారు. ఢిల్లీలో అతి చిన్న వయసులో గుండె దానం ఇచ్చినట్లు ఆ చిన్నారి రికార్డు సృష్టించింది. తాజాగా ఓ యువతి తాను చనిపోతూ ఐదుగురి ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి చనిపోతూ ఐదుగురి ప్రాణాలు కాపాడింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మౌనిక అనే యువతి అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆదివారం గ్రీన్ చానల్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు మౌనిక అవయవాలు తరలించారు. మౌనిక గుండెను విశాఖకు తరలించారు. సదరు యువతి అవయవదానం ద్వారా ఐదుగురి కుటుంల్లో వెలుగులు నింపింది.

ఎచ్చెర్ల మండలం కొత్త పేట గ్రామానికి చెందిన బొడిగి మౌనిక, శ్రీకాకుళం పట్టణంలో ఉన్న సచివాలయంలో వీఆర్ఓ గా విధులు నిర్వహిస్తుంది. నవంబర్ 22 న మౌనిక టూ వీలర్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే మౌనికకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు నిర్దారించారు.

మౌనిక పరిస్థితి కుటుంబ సభ్యులకు వివరించి ఆమె అవయవదానం చేయడానికి అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు మౌనిక అవయవదానం చేయడానికి ముందుక వచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్ నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో మౌనిక అవయవాలు కొద్ది గంటల్లో వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆ విధంగా మౌనిక తాను చనిపోతూ.. ఐదుగురికి పునర్జన్మనిచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి