iDreamPost

ఆసియా కప్ ఎఫెక్ట్.. పాక్ జట్టులో గొడవలు! డ్రెస్సింగ్ రూమ్ లో..

  • Author Soma Sekhar Published - 09:50 PM, Sat - 16 September 23
  • Author Soma Sekhar Published - 09:50 PM, Sat - 16 September 23
ఆసియా కప్ ఎఫెక్ట్.. పాక్ జట్టులో గొడవలు! డ్రెస్సింగ్ రూమ్ లో..

ఆసియా కప్ లో సూపర్-4 దశలోనే ఇంటి ముఖం పట్టింది దాయాది దేశం పాకిస్థాన్. దీంతో ఆ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ మాజీ క్రికెటర్లే పాక్ జట్టుపై అలాగే మేనేజ్ మెంట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీమిండియాను చూసి బుద్దితెచ్చుకోవాలని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మండిపడిన సంగతి తెలిసిందే. ఇక ఆసియా కప్ లో శ్రీలంకపై ఓటమితో పాక్ జట్టులో విభేదాలు బయటపడ్డాయి. డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ బాబర్ అజంకు బౌలర్ షాహిన్ అఫ్రిదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆసియా కప్ లో ఓటమి ఎఫెక్ట్ ఆ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీలంకతో మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆటగాళ్లపై నిప్పులు చెరిగాడు. ప్లేయర్లు రెస్పాన్సిబులిటితో ఆడటం లేదని మండిపడ్డాడు. బాబర్ మాట్లాడుతున్న క్రమంలోనే పాక్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది జోక్యం చేసుకున్నాడు. బాగా ఆడిన బ్యాటర్లను, బౌలర్లను పొగడొచ్చు కదా అని చెప్పగా.. బాబర్ అతడి మాటలను పట్టించుకోలేదు. నాకు తెలుసు ఎవరు బాగా ఆడారో అంటూ కోపంతో చెప్పగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అయితే వీరిద్దరి మధ్య గొడవ పెద్దది అవుతుండగా.. పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ జోక్యం చేసుకుని ఇద్దరికి సర్దిచెప్పాడని ఛానల్ డాన్ తన కథనంలో పేర్కొంది. ఈ గొడవ జరిగిన దగ్గర నుంచి జట్టు ఉన్న హోటల్ వెకేట్ చేసే టైమ్ నుంచి పాక్ వచ్చే వరకు సహచర ఆటగాళ్లకి దూరంగా ఉన్నాడట బాబర్. దీంతో ఎప్పటి నుంచో పాక్ జట్టులో విభేదాలు ఉన్నాయని, అవి ఇప్పుడు బయటపడ్డాయని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. కాగా.. ఆసియా కప్ నుంచి వైదొలిగిన తర్వాత షాహిన్ అఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. వరల్డ్ కప్ కు తాము కఠినంగా సిద్దమవుతామని ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి