iDreamPost

నాటి ఉద్యమ సారథే నేడు దేశ్ కి నేతగా ఎదిగిన KCR

ఏదీ చిన్నగా ఆలోచించకూడదు, పెద్దగా ఆలోచించాలి. అంతే భారీగా ప్రణాళికలు వేసి అమలు చేయాలని చాలా తక్కువ మంది భావిస్తుంటారు. అలా పెద్దగా ఆలోచించిన వారే జీవితంలో విజయం సాధిస్తారు. ఆకోవాకు చెందిన వారే తెలంగాణ సీఎం కేసీఆర్. అలాంటి గొప్ప విజన్ కలిగి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏదీ చిన్నగా ఆలోచించకూడదు, పెద్దగా ఆలోచించాలి. అంతే భారీగా ప్రణాళికలు వేసి అమలు చేయాలని చాలా తక్కువ మంది భావిస్తుంటారు. అలా పెద్దగా ఆలోచించిన వారే జీవితంలో విజయం సాధిస్తారు. ఆకోవాకు చెందిన వారే తెలంగాణ సీఎం కేసీఆర్. అలాంటి గొప్ప విజన్ కలిగి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాటి ఉద్యమ సారథే నేడు దేశ్ కి నేతగా ఎదిగిన KCR

ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపించే పేరు. కేసీఆర్..కేసీఆర్.కేసీఆర్. ఈ మూడు అక్షరాలకు ఎంతో చరిత్ర ఉంది. ఈ మూడు అక్షరాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి. ఈ మూడు అక్షరాలే ఢిల్లీ నేతలతో కొట్లాడి మరీ తెలంగాణను తీసుకొచ్చాయి. అంతేకాక పార్లమెంట్ ను కూడా గడగడలాడించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి చూపించాయి. ఆ మూడు అక్షరాలే బంగారు తెలంగాణను నిర్మించాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. అందుకే ఆ మూడు అక్షరాలకు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ వచ్చింది. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాజకీయాల్లో, చరిత్రలో చిరకాలం నిలిచిపోయే నేత ఆయన. అందరూ ముద్దుగా కేసీఆర్ అని పిలుచుకుంటారు.

ఓ సాధారణ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన కేసీఆర్ జీవితం అందరికీ ఆదర్శం. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. 2014 జూన్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి  తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రావడానికి చాలా ఏళ్ల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఢిల్లీ పెద్దలతో కొట్లాడటమే కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను వదలాడానికి సైతం సిద్ధమయ్యారు. ఇలా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎంతో మంది తెలంగాణ వీరుల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం అనేక మలుపు తిరిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని మానేరు ఎగువ ఆనకట్ట నిర్మాణంలో భూమిని కోల్పోయి ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడిన కల్వకుంట్ల రాఘవయ్య, వెంకటమ్మల దంపతులకు కేసీఆర్ జన్మించారు. వాళ్లది మధ్యతరగతి కుటుంబమే.. కానీ, కాలేజీ రోజుల నుంచే నాయకత్వ స్థానాల్లోకి వెళ్ళాలన్న కల కేసీఆర్‌ను వెంటాడేది. ఆ దిశగా ఆయన ప్రయాణం మొదట పరాజయాలతోనే మొదలైంది. బీఏ చదివి సమయంలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లోనే ప్రారంభమైంది.

ఉస్మానియా యూనివర్సీటీ నుంచి లిట‌రేచ‌ర్‌లో ఎంఏ ప‌ట్టా తీసుకుని యువ‌జ‌న కాంగ్రెస్‌తో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ కి, సంజ‌య్ గాంధీకి కేసీఆర్ బాస‌ట‌గా నిలిచారు. ఇదే సమయంలో నందమూరి తారక రామారావు 1983లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు, తెలుగు జాతిపై ఉన్న అభిమానంతో టీడీపీ చేరారు. ఆ టైమ్ లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తన రాజకీయ తొలి గురువు మదన్ మోహన్ మీదే పోటీ చేసి కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ తరువాత 1985లో మళ్ళీ టీడీపీ తరఫున బరిలోకి దిగి తన రాజకీయ జీవితంలో తొలి విజయాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయిదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1987లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1997లో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ 1999 ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.

తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం కేసీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 2001 కేసీఆర్ టీడీపీ రాజీనామా చేశారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోరే వారి స‌ర‌స‌న నిల‌బ‌డ్డి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పోరాటం చేశారు. తెలంగాణ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకోవ‌డ‌మే స‌బ‌బ‌ని ఆయ‌న బలంగా నమ్మారు. 2001లో సొంతంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని స్థాపించారు.

కాంగ్రెస్ హాయాంలో కేంద్ర కేబినెట్ మంత్రి పని చేశారు. ఆగ‌స్టు 2006లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2009లో 29 న‌వంబ‌ర్‌న నిరాహార దీక్ష మొద‌లుపెట్టారు.  ఈ క్రమంలోనే చావు నోట్ల తలపెట్టి మరి.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2018 రెండో సారి సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన సిద్ధిపేట జిల్లాలోని గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంత‌కుముందు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సిద్ధిపేట ఎమ్మెల్యేగాను, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గాల ఎంపీగాను సేవ‌ల‌ను అందించారు.

కేసీఆర్ వ్యక్తిత్వం

మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో చంద్రశేఖర్ రావుది ప్రత్యేకమైన శైలి. రాజకీయాల్లో కేసీఆర్ ప్రసంగకళకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేసీఆర్ బలమైన నాయకుడే కాకుండా, ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల యుక్తిపరుడు. భావజాలాన్ని వినిపించడం కాదు, ప్రజల గుండెల్లో నాటగల సమర్థుడు కేసీఆర్.  ఏదీ చిన్నగా ఆలోచించకూడదని, పెద్దగా ఆలోచించాలి. అంతే భారీగా ప్రణాళికలు వేసి అమలు చేయాలన్నది కేసీఆర్ నమ్మిన సూత్రం. ఎన్టీఆర్‌లోని ఇంపల్సివ్ డెసిషన్ మేకింగ్ స్టయిల్, వైఎస్సార్‌లోని నిష్కర్షగా వ్యవహరించే లక్షణం, చంద్రబాబులోని మానిప్యులేషన్… ఇవన్నీ కలిస్తే కేసీఅర్ దగ్గర నుంచి చూసిన వాళ్లు చెప్పే మాట ఇది.

ఇలా బాల్యదశ నుంచి నాయకత్వ లక్షణాలు పెంచుకున్న కేసీఆర్… ఆ దిశగా అడుగు వేసి .. విజయం సాధించారు. ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపినా.. రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాత్రం కేసీఆర్ కే తగ్గింది. అందుకే తెలంగాణ ప్రజలు వరసగా రెండు సార్లు ఆయనకే అధికారం కట్టబెట్టారు. మూడోసారి కూడా గెలిచేందుకు ప్రస్తుతం ఎన్నికల్లో వ్యూహాలు రచిస్తున్నారు. ఏది ఏమైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనడానికి కేసీఆర్ జీవితమే ఆదర్శం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి