iDreamPost

ఒక్క ముద్దు ఎంతపని చేసింది.. అతడిపై మూడేళ్ల నిషేధం!

  • Author Soma Sekhar Published - 10:09 AM, Tue - 31 October 23

స్పానిష్ ఫుట్ బాల్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ మీద కొరడాఝుళిపించింది ఫిఫా ఫెడరేషన్. మహిళా ప్లేయర్ తో అనుచితంగా ప్రవర్తించాడనే కారణంతో మూడేళ్ల పాటు అతడిని నిషేధించింది.

స్పానిష్ ఫుట్ బాల్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ మీద కొరడాఝుళిపించింది ఫిఫా ఫెడరేషన్. మహిళా ప్లేయర్ తో అనుచితంగా ప్రవర్తించాడనే కారణంతో మూడేళ్ల పాటు అతడిని నిషేధించింది.

  • Author Soma Sekhar Published - 10:09 AM, Tue - 31 October 23
ఒక్క ముద్దు ఎంతపని చేసింది.. అతడిపై మూడేళ్ల నిషేధం!

తమ టీమ్ ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలో పట్టరాని సంతోషంతో ఓ జట్టు చీఫ్ చేసిన పని.. అతడిని మూడు సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టింది. ప్లేయర్ తో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను.. అతడిపై కోరడా ఝుళిపించింది ఫిఫా ఫెడరేషన్. ఆస్ట్రేలియాలో జరిగిన ఫిఫా మహిళల ప్రపంచ కప్ ను స్పెయిన్ గెలిచిన విషయం తెలిసిందే. తొలిసారి స్పెయిన్ ఈ ట్రోఫీని సాధించింది. దీంతో పట్టరాని సంతోషంతో స్పానిష్ ఫుట్ బాల్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ స్టార్ ప్లేయర్ కు లిప్ కిస్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఫిఫా ఫెడరేషన్ దీనిని సీరియస్ గా తీసుకుంది.

స్పానిష్ ఫుట్ బాల్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ మీద కొరడాఝుళిపించింది ఫిఫా ఫెడరేషన్. మహిళా ప్లేయర్ తో అనుచితంగా ప్రవర్తించాడనే కారణంతో మూడేళ్ల పాటు అతడిని నిషేధించింది. ఈ మూడు సంవత్సరాలు అతడు ఫుట్ బాల్ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకూడదని తేల్చి చెప్పింది. అసలేం జరిగిందంటే? ఆస్ట్రేలియా వేదికగా ఆగస్ట్ నెలలో మహిళల ఫిఫా వరల్డ్ కప్ జరిగింది. ఈ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఫైనల్లో ఇంగ్లాండ్ ను 1-0తో ఓడించింది స్పెయిన్ మహిళల జట్టు. ఇక ఈ వరల్డ్ కప్ ను స్పెయిన్ గెలవడం ఇదే తొలిసారి. దీంతో స్పెయిన్ ఫుట్ బాల్ చీఫ్ లూయిస్ ఆ సంతోషాన్ని పట్టలేకపోపయాడు. అత్యుత్సాహంతో.. మెడల్స్ అందించే సమయంలో జట్టు స్టార్ ప్లేయర్ జెన్నిఫర్ హెర్మోస్ తో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెకు లిప్ కిస్ ఇచ్చాడు లూయిస్.

అదీకాక ఇతర ప్లేయర్లతో కూడా అనుచితంగా ప్రవర్తించాడు లూయిస్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో లూయిస్ పై ఫిఫా తక్షణ చర్యల కింద 90 రోజుల పాటు నిషేధం విధించింది. దీంతో తన పదవికి రాజీనామా చేశాడు రుబియాలెస్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపిన ఫిఫా ఫెడరేషన్ క్రమశిక్షణ కమిటి.. అతడిపై మూడు సంవత్సరాలు నిషేధం విధించింది. అయితే తాను ఆమె అనుమతితోనే తాను ముద్దు పెట్టుకున్నట్లు లూయిస్ చెప్పగా.. జెన్నిఫర్ మాత్రం తనేమీ అంగీకరించలేదని చెప్పడం గమనార్హం. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఒక్క ముద్దు ఎంతపని చేసింది.. ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాలిగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి