iDreamPost

స్పానిష్ రే*ప్ విక్టిమ్ గొప్ప మనసు.. ఇండియన్స్ గొప్పవాళ్లు అంటూ..

Spanish Bike Rider On Indians: స్పానిష్ మహిళా బైక్ రైడర్ పై ఝార్ఖండ్ లో అఘాయిత్యం జరిగిన విషయం తెలిసిందే. అంత ఘోరం జరిగినా ఆమె మాత్రం ఇండియన్స్ గొప్పవాళ్లు అంటూ వ్యాఖ్యలు చేసింది.

Spanish Bike Rider On Indians: స్పానిష్ మహిళా బైక్ రైడర్ పై ఝార్ఖండ్ లో అఘాయిత్యం జరిగిన విషయం తెలిసిందే. అంత ఘోరం జరిగినా ఆమె మాత్రం ఇండియన్స్ గొప్పవాళ్లు అంటూ వ్యాఖ్యలు చేసింది.

స్పానిష్ రే*ప్ విక్టిమ్ గొప్ప మనసు.. ఇండియన్స్ గొప్పవాళ్లు అంటూ..

దేశం ఉలిక్కి పడే ఘటన ఝార్ఖండ్ లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. బ్రెజిలియన్ జంట ఇండియాలో బైక్ టూర్ చేస్తుండగా ఆ మహిళపై అఘాయిత్యం జరిగింది. మొత్తం ఏడుగురు వ్యక్తులు లేడీ రైడర్ భర్తపై దాడి చేశారు. వారి వస్తువులు దోచుకోవడమే కాకుండా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పెట్రోలింగ్ వెహికల్ ని ఆపి వాళ్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో వీడియో రూపంలో తనపై జరిగిన ఘోరాన్ని ప్రపంచానికి చెప్పింది. అయితే ఈ ఘటన తర్వాత ఆ స్పానిష్ బైక్ రైడర్ తన గొప్ప మనసును చాటుకుంది. భారతీయులు గొప్పవాళ్లు వాళ్లని విమర్శించకండి అంటూ వ్యాఖ్యానించింది.

ఝార్ఖండ్ దుంకా జిల్లాలో 35 ఏళ్ల బ్రెజిలియన్ బైక్ రైడర్ పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ జటంపై దాడి చేయడమే కాకుండా.. వారి వస్తువులు లాక్కున్నారు. అంతేకాకుండా ఆమెపై ఏడుగురు వ్యక్తులు అతి కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్ వాహనాన్ని వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఘటన వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితులను గుర్తించారు. వారిలో నలుగురిని పట్టుకుని అరెస్టు కూడా చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువుని మంటగలిపేలా చేసింది అనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, బాధితురాలు మాత్రం మన దేశం, మన ప్రజల గురించి ఎంతో గొప్పగా చెప్పింది. భారతీయులను తాను తప్పుబట్టడం లేదని.. ఇండియన్స్ ని విమర్శించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించింది.

అత్యాచారానికి గురైన స్పానిష్ బైక్ రైడర్ ఇండియా నుంచి బిహార్ మీదుగా నేపాల్ కు వెళ్లేందుకు బయల్దేరుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. తనపై జరిగిన అఘాయిత్యానికి ఇండియన్స్ మొత్తాన్ని తాను బ్లేమ్ చేయడం లేదని చెప్పింది. అలాగే ఎవరూ ఇండియన్స్ ని విమర్శించాల్సిన అవసరం లేదంది. తనపై దారుణానికి ఒడిగట్టిన వారిని మాత్రమే బ్లేమ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాను ఇండియాలో మొత్తం 20 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానంది. తనను ఇండియన్స్ ఎంతో బాగా ఆదరించారని.. వారి అతిథి మర్యాదలు తనకు ఎంతగానో నచ్చాయంటూ చెప్పుకొచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి అందరినీ విమర్శించడం కూడా కరెక్ట్ కాదు అనే కోణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం మాత్రమే కాకుండా.. ఆమెపై గౌరవం మరింత పెరిగేలా చేసింది అంటున్నారు. నిజానికి తనపై జరిగిన అఘాయిత్యానికి ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు తీసేందుకు ఎన్నో పనులు, ప్రయత్నాలు చేయచ్చు. కానీ, ఆవిడ మాత్రం అలాంటి పనులు చేయలేదు. ఆమె భర్త కూడా పోలీసులు వేగంగా స్పదించడమే కాకుండా.. దర్యాప్తు చేపట్టారు అంటూ ప్రశంసించారు. ఈ ఘటనపై ఝార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామంటూ హామీ ఇచ్చింది. మరి.. తనకు అంత అన్యాయం జరిగినా భారతీయులు మంచోళ్లు అంటూ స్పానిష్ బైక్ రైడర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి