iDreamPost

2023 వరల్డ్ కప్ సెమీస్ చేరే టీమ్స్ ఇవే! ఆశ్చర్యంగా 5 జట్ల పేర్లు చెప్పిన గంగూలీ!

  • Author Soma Sekhar Published - 01:14 PM, Mon - 10 July 23
  • Author Soma Sekhar Published - 01:14 PM, Mon - 10 July 23
2023 వరల్డ్ కప్ సెమీస్ చేరే టీమ్స్ ఇవే! ఆశ్చర్యంగా 5 జట్ల పేర్లు చెప్పిన గంగూలీ!

2023 వరల్డ్ కప్ మహా సంగ్రామం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇక ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి వరల్డ్ కప్ గెలిచే జట్టు ఏది? ఏ జట్లు సెమీస్ చేరతాయి అన్న చర్చ మెుదలైంది. ఇక ఈ విషయాలపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను తెలియపరిచారు. తాజాగా అభిప్రాయాలు తెలియపరిచిన జాబితాలో చేరాడు బీసీసీఐ మాజీ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 2023 వరల్డ్ కప్ లో సెమీస్ చేరే జట్లు ఇవే అంటూ.. వాటి పేర్లు చెప్పాడు. అయితే సెమీస్ కు నాలుగు జట్లే చేరుతాయి.. కానీ గంగూలీ ఐదో జట్టుగా పాకిస్థాన్ పేరును చేర్చడం గమనార్హం. మరి గంగూలీ చెప్పిన ఆ జట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ వేదికగా 2023 వరల్డ్ కప్ అక్టోబర్-నవంబర్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు వరల్డ్ కప్ గెలుస్తుంది అన్న దానిపై ఇప్పటికే చర్చ మెుదలైంది. ఈ క్రమంలో పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇలా అభిప్రాయాలు తెలియజేసిన జాబితాలో తాజాగా టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు చేరే జట్ల పేర్లను వెల్లడించాడు దాదా. గంగూలీ అభిప్రాయం ప్రకారం.. 2023 వరల్డ్ కప్ సెమీస్ కు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేరుతాయని గంగూలీ తెలిపాడు.

అయితే ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదని, అది కూడా సెమీస్ చేరుతుందని పేర్కొన్నాడు. అయితే ఐదో జట్టుగా పాకిస్థాన్ కూడా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాడు సౌరవ్. ఇదే జరిగితే.. ఈడెన్ గార్డెన్ లో భారత్-పాక్ మ్యాచ్ చూడొచ్చని ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సందర్భంగా.. భారత ఆటగాళ్ల ఒత్తిడిపై కూడా స్పందించాడు. ఈ వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతుండటంతో.. సహజంగానే భారత ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందని దాదా తెలిపాడు. అయితే ఈ ఒత్తిడిని టీమిండియా ఆటగాళ్లు జయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా.. ప్లాన్లు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే టీమిండియా ప్లేయర్స్ కీలక సమయాల్లో సరిగ్గా ఆడట్లేదని వివరించాడు. మరి గంగూలీ చెప్పినట్లుగా ఆ జట్లు సెమీస్ చేరుతాయా? మీ అభిప్రాయం ప్రకారం ఏ టీమ్స్ సెమీస్ చేరుతాయో కామెంట్స్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి