iDreamPost

World Cup 2023: గంగూలీ ఎమోషనల్ పోస్ట్! అప్పుడు మిస్సైంది.. కానీ ఇప్పుడు..

  • Author Soma Sekhar Published - 12:20 PM, Fri - 30 June 23
  • Author Soma Sekhar Published - 12:20 PM, Fri - 30 June 23
World Cup 2023: గంగూలీ ఎమోషనల్ పోస్ట్! అప్పుడు మిస్సైంది.. కానీ ఇప్పుడు..

2023 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయ్యింది. దాంతో అన్ని జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకునే పనిలో నిమగ్నమైయ్యాయి. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లాండ్-న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఇక టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ తో ప్రారంభించబోతోంది. ఇదంతా ఒకెత్తు అయితే.. అందరు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు టీమిండియా దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

సౌరవ్ గంగూలీ.. టీమిండియా చరిత్ర గతిని మార్చిన కెప్టెన్ గా తనకంటూ ఓ హిస్టరీని క్రియేట్ చేసుకున్నాడు. ఎంతో మంది యువ క్రికెటర్లను భారత జట్టులోకి తీసుకొచ్చి.. టీమిండియాను పటిష్టమైన టీమ్ గా తీర్చిదిద్దాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత రకరకాల పదవులు అలంకరించాడు ఈ బెంగాల్ టైగర్. బీసీసీఐ అధ్యక్షుడిగా తన అమోఘమైన సేవలను జట్టుకు అందించాడు. కాగా.. వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ తర్వాత దాదా ఓ ఎమోషనల్ పోస్ట్ ను తన అభిమానులతో పంచుకున్నాడు.

ఈ పోస్ట్ లో..”కరోనా కారణంగా నేను అధ్యక్షుడిగా ఉన్నాగానీ.. ప్రపంచ కప్ ను నిర్వహించలేకపోయాను. దాంతో నేను భారత్ లో జరిగే వరల్డ్ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అద్భుతమైన వేదికలను అలాట్ చేశారు. ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయని మరే దేశమూ గర్వంగా చెప్పుకోలేదు” అని గంగూలీ ఆ పోస్ట్ లో రాసుకోచ్చారు. ఇక ఈ మెగా టోర్నీని ప్రపంచ మెుత్తం గుర్తుంచుకునేలా బీసీసీఐ నిర్వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు దాదా. బీసీసీఐ, సెక్రెటరీ జై షా, రోజర్ బిన్నీకి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు గంగూలీ. కాగా.. దాదా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021 టీ20 వరల్డ్ కప్ భారత్ లో నిర్వహించాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ టోర్నీని యూఏఈకి మర్చాల్సి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి