iDreamPost

ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌కు శ్రీకారం.. ఇకపై వీడియో కాల్‌!

  • Published Aug 12, 2023 | 1:05 PMUpdated Aug 12, 2023 | 1:05 PM
  • Published Aug 12, 2023 | 1:05 PMUpdated Aug 12, 2023 | 1:05 PM
ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌కు శ్రీకారం.. ఇకపై వీడియో కాల్‌!

సోషల్‌ మీడియా అనేది మన జీవితంలో నిత్యవసరం అయ్యింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. నిత్యం సోషల్‌ మీడియాలోనే గడిపేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక రకరాల మెసేజింగ్‌ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. ఇక ఈ యాప్‌లు ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎప్పటి కప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌ని తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్స్‌(ట్విట్టర్‌) తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్విట్టర్‌ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది మెసేజ్‌లు. అయితే ఇక మీదట యూజర్లు ట్విట్టర్‌ ద్వారా వీడియోల్‌ కాల్‌ కూడా చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్‌ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.

ట్విట్టర్‌ సోషల్‌ మీడియా యాప్‌ స్థాయి నుంచి సూపర్‌ యాప్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎక్స్‌గా పేరు మార్చుకుని.. సరికొత్తగా యూజర్ల ముందుకు వచ్చింది. ఇక త్వరలోనే వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇదేకాక ట్విట్టర్‌లో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను పోస్ట్‌ చేయడం, కంటెంట్‌ క్రియేటర్‌ సబ్‌స్క్రిప్షన్‌, డిజిటల్‌ చెల్లింపులు వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు లిండా వెల్లడించారు.

ఇక ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయంలోని వస్తువులను వేలానికి ఉంచినట్లు.. ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో కాఫీ టేబుల్స్‌, భారీ పక్షి పంజరాలు, వైరల్‌గా మారిన ఆయిల్‌ పెయింటింగ్స్‌, డెస్క్‌లు, డీజే బూత్‌, మ్యూజికల్‌ పరికరాలు ఇలా అన్ని కలిపి మొత్తం.. 584 వస్తువులను వేలానికి ఉంచినట్ల ఆంగ్ల వార్తా సంస్థ కథనాలు వెల్లడించింది. వేలంలో వీటి ప్రారంభ ధర 25 డాలర్లుగా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 12 నుంచి 14 వరకు ఈ వేలం ప్రక్రియ జరగనున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌ను సూపర్‌ యాప్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే దాని పేరును ఎక్స్‌గా మార్చినట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి