iDreamPost

మళ్ళీ IT జోరు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు!

IT is Booming Again: ప్రపంచాన్ని కరోనా ఒక్క కుదుపు కుదిపేసింది. ప్రాణాలు, ఆస్తి నష్టమే కాదు.. వేల మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వారిలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉన్నారు.

IT is Booming Again: ప్రపంచాన్ని కరోనా ఒక్క కుదుపు కుదిపేసింది. ప్రాణాలు, ఆస్తి నష్టమే కాదు.. వేల మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వారిలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉన్నారు.

మళ్ళీ IT జోరు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్  ఇక ఊపిరి పీల్చుకోవచ్చు!

భారత్ తో సహా పలు దేశాలు కొంత కాలంగా ఆర్థిక మాంద్యంతో సతమతమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఐటీకి డిమాండ్ తగ్గిందో.. అమెరికా, బ్రిటన్ ఇలా పలు దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను ఉన్నఫలంగా తొలగించాయి. మళ్లీ కొత్త నియామకాలు చేపట్టలేదు. ఇక భారత దేశంలో లేఆఫ్స్ పెద్దగా లేకపోయినప్పటికీ.. కొత్త నియామకాలు మాత్రం చేయలేదు.  భవిష్యత్ లో ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించే విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలు కంపెనీలు భావించాయి. దీంతో ఐటీ రంగం పెద్ద గందరగోళంలో పడిపోయిందని అందరూ భావించారు.. కొంతమంది సొంత ఊర్లకు వెళ్లి వ్యవసాయం, చిరు వ్యాపారాలు మొదలు పెట్టారు. తాజాగా ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా ఐటీ ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి నిరాశలే మిగులుతున్నాయి. సరైన డిమాండ్ లేకపోవడంతో పెద్ద పెద్ద టెక్ సంస్థల్లో కూడా రిక్రూట్ మెంట్స్ లేకపోవడంతో ఎంతోమంది నిరాశలో మునిగిపోయారు. కరోనా సమయంలో కూడా ఐటీకి మంచి డిమాండ్ ఉంది.. ఆ తర్వాత భారీ స్థాయిలో పడిపోయింది. ద్రవ్యోల్భణం పెరుగుతున్న క్రమంలో ఆర్థిమ మాంద్యం భయాలు కలగడం సహజం. అందుకు అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ ఎంప్లాయిస్ ని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ వచ్చాయి. వీటిలో గుగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇక భారత దేశం విషయానికి వస్తే.. అతి పెద్ద ఐటీ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్), హెచ్ సీఎల్ టెక్నాలజీ,ఇన్పోసిస్, టెక్ మహీంద్రా, విప్రో లాంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య చాలా వరకు తగ్గింది. కొంతకాలంగా ఈ కంపెనీల్లో రిక్రూట్ మెంట్ కూడా లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఐటీ కంపెనీలు మళ్లీ జోరు పెంచాయి. ఎగ్జిక్యూటీవ్ సెర్స్ అండ్ రిక్రూట్ మెంట్ సర్వీసెస్ ఫర్స్మ్ ప్రకారం.. సీనియర్ లెవెల్స్, ఐటీ సంస్థలు లీడర్ షిప్ సహా కొత్త రోల్స్ కోసం ఎంప్లాయిస్ నియామకం వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. అమెరికా, బ్రిటన్, భారత్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీనియర్ లేవల్ ఐటీ ఉద్యోగాలతో పాటు టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్న వారికి ఇక మంచి రోజులు వస్తున్నాయని అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐ స్కిల్స్ కోసం చాలా కంపెనీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఐటీ ఉద్యోగాల కోసం యువత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో వారిలో కొత్త ఆశలు చిగురించే వార్త కావడంతో సంతోషంటో మునిగిపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి