iDreamPost

తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక డబ్బు! రూ.42 కోట్లు సీజ్!

తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక డబ్బు!  రూ.42 కోట్లు సీజ్!

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ లో అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ అమలవుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు, ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే కోట్ల డబ్బు సీజ్ చేయగా.. తాజాగా ఒకేసారి రూ.42 కోట్ల సీజ్ చేసిన ఘటన

ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వెహికిల్స్ చెక్ చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా డబ్బు పట్టుబడుతుంది. వాటికి ఎలాంటి పేపర్లు చూపించకపోవడంతో సీజ్ చేస్తున్నారు. ఆ డబ్బును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగిస్తున్నారు. కర్ణాటకలోని బెంగుళూరు లో శుక్రవారం ఉదయం రూ. 42 కోట్ల నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరులో ఓ అపార్ట్ మెంట్ నుంచి హవాలా మార్గం ద్వారా నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు పక్కాగా సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే భారీగా నగదు పట్టబడిందని ఐటీ అధికారులు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణకు రూ.8 కోట్లు తరలిపోయినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ డబ్బు మొత్తం ఓ మంత్రికి చెందినది అని ప్రచారం జరుగుతుంది.. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.50 కోట్ల రూపాయలు తెలంగాణలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారని.. అన్నీ 500 రూపాయల నోట్లే అని ఐటీ అధికారులు అంటున్నారు.  ప్రస్తుతం తాము రూ.42 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హవాలా ద్వారా పెద్ద ఎత్తున డబ్బు మారుతుందని సమాచారం తెలియగానే ఉదయం కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్ ఇంటిలో దాడులు చేశామని.. ఆర్టీ నగర్ లో రెండు నివాసాల్లో తనిఖీ చేయగా పద్దతిగా 22 బాక్సుల్లో డబ్బు పేర్చి ఎవరికీ అనుమానం రాకుండా తరలించేందుకు సిద్దంగా ఉంచిన 42 కోట్లు రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు. సదరు కార్పోరేటర్ మాజీ ఎమ్మెల్యే బంధువు అని సమాచారం. కాకపోతే దీనిపై స్పష్టత రాలేదు.. ఈ కేసు ఐటీ నుంచి ఈడీకి బదిలీ చేశారు.

ఇదిలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. తెలంగాణలో మూడోసారి తమ పట్టు సాధించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది, ఈ దఫా ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు తరలి వస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. గత నాలుగు రోజుల నుంచి రూ.37 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో 30 కిలోల బంగారం, 350 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో మద్యం, నగదు పంపకాలకు అడ్డు కట్ట వేయాలని అధికారులకు ఎలక్షన్ కమీషన్ గట్టిగానే ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి