iDreamPost

జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్..!

జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో  పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్..!

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టాపిక్ ‘ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం’. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. శుక్రవారంతో రిమాండ్ ముగియగా.. మరో రెండు రోజులు పొడిగించింది కోర్టు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఆయన్ను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరగా.. రెండు రోజుల విచారణకు అనుమతినిచ్చిన సంగతి విదితమే. శని, ఆదివారాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన విచారణ కొనసాగుతుంది.

స్కిల్ కుంభకోణం కేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఓ మహిళా న్యాయమూర్తి తీర్పు నివ్వడం సంచలనం కాగా, టీడీపీ శ్రేణులు ఆమెపై వ్యక్తిగత దాడులకు దిగాయి. దీంతో ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. చంద్రబాబుకు రిమాండ్ విధించిన ప్రత్యేక ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. ఆమెను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కించపరుస్తూ దాడి చేస్తున్నారు. ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టడంపై రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. దీనిపై రాష్ట్రపతి భవన్ సీరియస్‌గా తీసుకుంది. హిమబిందుపై నెగిటివ్‌గా పెట్టిన పోస్టులు, దానికి కారకులైన వారిపై చర్యలను తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆ పోస్టులు పెట్టిన వారిపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదు దారుడికి వివరించాలని లేఖ రాశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి