iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD Trailer : కల్కి ట్రైలర్ లో దీపిక డబ్బింగ్‌పై ట్రోల్స్.. కారణం ఏమై ఉంటుంది!

  • Published Jun 11, 2024 | 8:55 AM Updated Updated Jun 11, 2024 | 8:55 AM

కల్కి సినిమా కోసం మూవీ లవర్స్ అంత ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు అందరి ఎదురు చూపులకు బ్రేక్ పడేలా.. జూన్ 10 న కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. తీరా ట్రైలర్ రిలీజ్ చేశాక ఇప్పుడేమో ట్రోలింగ్స్ చేస్తున్నారు. అసలు కారణం ఏమై ఉంటుంది. చూసేద్దాం.

కల్కి సినిమా కోసం మూవీ లవర్స్ అంత ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు అందరి ఎదురు చూపులకు బ్రేక్ పడేలా.. జూన్ 10 న కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. తీరా ట్రైలర్ రిలీజ్ చేశాక ఇప్పుడేమో ట్రోలింగ్స్ చేస్తున్నారు. అసలు కారణం ఏమై ఉంటుంది. చూసేద్దాం.

  • Published Jun 11, 2024 | 8:55 AMUpdated Jun 11, 2024 | 8:55 AM
Kalki 2898 AD Trailer : కల్కి ట్రైలర్ లో దీపిక డబ్బింగ్‌పై ట్రోల్స్..  కారణం ఏమై ఉంటుంది!

ఇప్పుడు మూవీ లవర్స్ అంతా కూడా.. ఎదురుచూసే సినిమా కల్కి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఆసక్తిగా ఎదురుచూసేవారి.. ఎదురుచూపులు బ్రేక్ పడింది. జూన్ 10 న కల్కి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు కల్కి సినిమా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపక పదుకొనె, దిశా పటాని లాంటి భారీ తారాగణం ఈ ట్రైలర్ లో కనిపించి.. ఈ సినిమాపై ఇంకా ఆసక్తి పెంచేశారు. హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమా ట్రైలర్ పైన భారీగానే స్పందన లభించింది. కానీ ఎందుకు ఏమో తెలియదు కానీ, తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత.. ట్రోలింగ్స్ స్టార్ట్ చేశారు. అసలు కారణం ఏమై ఉంటుంది. నాగ్ అశ్విన్ కల్కి ప్రపంచాన్ని చూపించడంలో ఎక్కడైనా తడబడ్డాడా… దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

నాగ్ అశ్విన్ తన కల్కి ప్రపంచానికి అందరిని తీసుకుని వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. దీనితో తాజాగా రిలీజ్ చేసిన కల్కి సినిమా ట్రైలర్ ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారింది, ట్రైలర్ ను గమనించినట్లయితే.. విజువల్స్, సినిమా కాన్సెప్ట్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి చిన్న విషయం ప్రభాస్ అభిమానులకు కిక్ ఇచ్చింది. దానితో పాటు ఇంకా చాలా ప్రశ్నలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ మూవీ కథ ఎలా కొనసాగబోతుంది! అమితాబ్ ప్రభాస్ మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి ! కమల్ లుక్ వెనుక దాగి ఉన్న పాత్ర ఏంటి ! దీపికా , దిశా క్యారక్టర్ ఏంటి ! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకులను ఈ సినిమా చూసేందుకు ప్రేరేపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఓ వర్గం ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ట్రైలర్ పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అదే దీపికా తెలుగు డబ్బింగ్ విషయమై చర్చలు జరుగుతున్నాయి.

Trolls On Deepika

దీపికా ఇలా డబ్బింగ్ చెప్పడం వెనుక ఏదైనా కారణం ఉందా ! లేదా నాగ్ ఇలా చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా ! అసలు దీపికా ఇలా ఎందుకు తెలుగు డబ్బింగ్ చెప్పింది ! అంటూ గుసగుసలు మొదలయ్యాయి. గతంలోనూ దీపికా ఇలానే డబ్బింగ్ చెప్పిందంటూ.. ఆమెకు సంబంధించిన పాత వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. మరి కేవలం ట్రైలర్ లోనే ఇలా ఉందా లేదా మూవీ మొత్తం ఇలానే ఉంటుందా! ఏమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సినిమా ట్రైలర్ పై నెట్టింట బాగానే డిస్కషన్స్ అవుతున్నాయి. అందరు జూన్ 27 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు . చివరికి ఏమౌతుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş