iDreamPost

ట్రైలర్ వచ్చాక ‘జైలర్’ పై కాపీ ట్రోల్స్! ఇంతకీ ఏ సినిమాతో పోల్చుతున్నారు..?

  • Author ajaykrishna Updated - 01:35 PM, Thu - 3 August 23
  • Author ajaykrishna Updated - 01:35 PM, Thu - 3 August 23
ట్రైలర్ వచ్చాక ‘జైలర్’ పై కాపీ ట్రోల్స్! ఇంతకీ ఏ సినిమాతో పోల్చుతున్నారు..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ చిత్రం.. ఆగష్టు 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే జైలర్ నుండి విడుదలైన పాటలు.. సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతలోనే మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో పూర్తిగా తలైవా స్టైల్, మాస్ లుక్, డైలాగ్స్.. యాక్షన్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ లో కట్ చేశారు. పైగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కి బూస్ట్ అయ్యింది. దీంతో.. ఒక్కసారిగా సినిమాపై ఉన్న అంచనాలన్నీ.. ఆడియన్స్, ఫ్యాన్స్ లో రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు.

ఇక జైలర్ ట్రైలర్ లో పూర్తిగా రజినీని చూపించిన మేకర్స్.. ఎక్కడ కూడా కీలకపాత్రలు పోషించిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ క్యారెక్టర్స్, లుక్స్ ని అసలు రివీల్ చేయలేదు. అంటే.. మరో ట్రైలర్ వదులుతారో లేక నేరుగా థియేటర్ లోనే సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా.. నెల్సన్ దిలీప్ మార్క్ డార్క్ కామెడీతో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సులు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత రజినీ నుండి మాస్ డైలాగ్స్ వినిపించాయి. ఈ సినిమాలో రజినీ.. టైగర్ ముత్తువెల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. ట్రైలర్ రిలీజ్ అయ్యాక జైలర్ మూవీ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.

ఇంతకీ ఏ హాలీవుడ్ మూవీని పోలి ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే.. 2021లో వచ్చిన ‘నో బడీ'(Nobody) మూవీ స్టోరీ కాపీ అని అంటున్నారు. ట్రైలర్ లో గమనిస్తే.. రజినీకాంత్ సాదాసీదా జీవితాన్ని గడిపే రిటైరైన వ్యక్తి పాత్ర పోషించినట్లు చూపించి.. ఆయనతో పెట్టుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు అన్నట్లు ప్రెజెంట్ చేశారు. మరోవైపు నోబడి మూవీలో కూడా.. పెళ్ళాం పిల్లలతో నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఓ వ్యక్తి.. అనుకోని పరిస్థితుల్లో రష్యన్ మాఫియాతో తలపడాల్సి వస్తుంది. అతను ఏం చేయలేడు అనుకునేవారికి షాకిస్తూ సినిమా సాగుతుంది. దాన్నే కొద్దిపాటి మార్పులతో జైలర్ గా చేశారని ప్రచారం మొదలైంది. అయితే.. కాపీనా కాదా? రిలీజ్ తర్వాత తెలుస్తుంది. సో.. అప్పటిదాకా ట్రైలర్ చూసి అంచనా వేయడం కరెక్ట్ కాదని కొందరి అభిప్రాయం. మరి జైలర్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి