iDreamPost

నకిలీ జడ్జిగా 2 వేల మంది క్రిమినల్స్ రిలీజ్.. మూవీకి మించిన ట్విస్టులు..

ఇండియాలోనే ఓ స్మార్టెస్ట్ దొంగ గురించి మీకు తెలుసా? ఏకంగ నకిలీ జడ్జీగా అవతారం ఎత్తి.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 2 వేల మంది నేరస్థులను విడుదల చేసిన పాన్ ఇండియా దొంగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలోనే ఓ స్మార్టెస్ట్ దొంగ గురించి మీకు తెలుసా? ఏకంగ నకిలీ జడ్జీగా అవతారం ఎత్తి.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 2 వేల మంది నేరస్థులను విడుదల చేసిన పాన్ ఇండియా దొంగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నకిలీ జడ్జిగా 2 వేల మంది క్రిమినల్స్ రిలీజ్.. మూవీకి మించిన ట్విస్టులు..

ప్రపంచం చరిత్రలో ఎంతో మంది దొంగలు ఉన్నారు. అయితే చరిత్రకు అందని దొంగలు కూడా ప్రస్తుత సమాజంలో తిరుగుతున్నారు. అందులో ఈ దొంగ.. కాదు కాదు.. గజ దొంగ కూడా ఒకడు. ఇతడి పేరు ధన్ రామ్ మిట్టల్. ఇతడు చదివింది లా.. కానీ చేసే పనులు మాత్రం క్రిమినల్ పనులే. మనోడి ఎక్స్ ట్రా టాలెంట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మకనపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీ కోర్స్ కూడా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ధన్ రామ్ మిట్టల్ ని మించిన దొంగ ఇంకోడు లేడనే చెప్పాలి. సినిమాను మించిన ట్విస్టులు ఉన్న ఇతడి జీవితం గురించి ఓసారి పరిశీలిద్దాం.

ధన్ రామ్ మిట్టల్.. ఓ కరుడుకట్టిన దొంగ. కారు దొంగతనం చేసిన కేసులో పోలీసులకు చిక్కిన అతడు చెప్పిన విషయాలు వింటే.. షాక్ అవ్వకతప్పదు. అతడి తొలి జీవితానికి వస్తే.. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్క్ గా పనిచేశాడు. అక్కడే ఓ సంచలనానికి తెరలేపాడు. ఆ కోర్టు జడ్జీ రెండు నెలలు లీవ్ పెట్టడంతో.. తనకు వచ్చిన ఫోర్జరీ విద్యతో నకిలీ పత్రాలు సృష్టించి తానే ఏకంగా జడ్జీ అవతారం ఎత్తాడు. ఇక్కడితో ఊరుకున్నాడా? అంటే లేదు. కేవలం రెండు నెలల కాలంలోనే 2వేల మంది నేరస్థులను విడుదల చేశాడు. మరికొంత మందిని జైల్లో పెట్టాడు కూడా.

ఇక ఈ భాగోతం బయటపడేలోపే.. అక్కడి నుంచి పారిపోయాడు. ఫోర్జరీ సంతకాలతో వివిధ హోదాల్లో ఆఫీసర్ గా విధులు నిర్వర్తించాడు. ఇక ఇతడు దొంగలించిన కార్ల విషయానికి వస్తే.. లెక్కేలేవు. 25 ఏళ్ల వయసు నుంచి దొంగతనాలు మెుదలుపెట్టిన ఇతడు.. 25 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. రైల్వే అధికారులనే బురిడీ కొట్టించి.. స్టేషన్ మాస్టర్ అవతారం ఎత్తాడు ధన్ రామ్ మిట్టల్.

హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో కార్ల దొంగతనానికి పెట్టింది పేరు ఇతడు. ఇతడికో స్పెషాలిటీ ఉందడోయ్.. ఏ కార్లను పడితే.. ఆ కార్లను దొంగలించడు. కేవలం మారుతి 800, హ్యూందాయ్ శాంత్రో, ఎస్టీమ్ లాంటి సెక్యూరిటీ లేని కార్లనే ఎత్తుకెళ్తాడు. పట్టపగలే కార్లు దొంగలించడం ఇతడి ప్రత్యేకత. ఎన్నిసార్లు జైలుకెళ్లొచ్చినా.. తన బుద్ది మాత్రం మార్చుకోవడం లేదు. ప్రస్తుతం 81 సంవత్సరాల వయసులోనూ ఇదే తంతు. కానీ ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. మరి ఈ గజదొంగపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తాను చనిపోయినా.. నలుగురిని బతికించిన కానిస్టేబుల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి