iDreamPost

మరింత పెరగనున్న స్మార్ట్ టీవీల ధరలు! ఎందుకంటే?

Smart Tv Prices Go Up: ప్రస్తుతం అందరూ స్మార్ట్ టీవీలే వాడుతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం స్మార్ట్ టీవీల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి.

Smart Tv Prices Go Up: ప్రస్తుతం అందరూ స్మార్ట్ టీవీలే వాడుతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం స్మార్ట్ టీవీల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి.

మరింత పెరగనున్న స్మార్ట్ టీవీల ధరలు! ఎందుకంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు వచ్చేవి అన్నీ స్మార్ట్ టీవీలే అవుతున్నాయి. వాటిలో కూడా పెద్ద స్క్రీన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అయితే సాధారణంగానే డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికే స్మార్ట్ టీవీల ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. వాటికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. కానీ, ఇప్పుడు డిమాండ్ తో సంబంధం లేకుండా ధరలు పెరగబోతున్నాయి అంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. స్మార్ట్ టీవీల ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.

ప్రస్తుతం అందరూ స్మార్ట్ టీవీలో కొంటున్నారు. చాలామంది వాడేది స్మార్ట్ టీవీ అయినా కూడా అంతకన్నా పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు. తద్వారా స్మార్ట్ టీవీల కొనుగోలు భారీగా పెరుగుతోంది. అంతేకాకుండా ఆఫ్ లైన్ కొనుగోళ్ల కంటే ఆన్ లైన్ కొనుగోళ్లు ఘననీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల సమయంలోనే స్మార్ట్ టీవీల ధరలు పెరగబోతున్నాయి అంటూ కౌంటర్ పాయింట్స్ ఐవోటీ సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ప్యానల్స్ ధరలు పెరగడమే అందుకు కారణంగా చెప్తున్నారు. ధరలు పెరిగినా కూడా కొనుగోళ్లు మాత్రం తగ్గే ప్రసక్తే లేదు అంటున్నారు. దేశీయంగా ప్రీమియం మోడల్స్ దిగుమతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. దిగుమతులు 9 శాతం మేర పెరగచ్చు అంటూ ఐవోటీ సంస్థ వెల్లడించింది.

ఆన్ లైన్లో డిస్కౌంట్స్ ఎక్కువగా ఉండటం, మంచి మంచి ఆఫర్స్ వస్తుండటంతో ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధర ఉండే టీవీలు మాత్రమే కాకుండా.. ప్రీమియం మోడల్స్ ని కూడా ఆన్ లైన్ లోనే కొంటున్నారు. గతేడాది మాత్రం టీవీల దిగుమతుల్లో 16 శాతం తగ్గుదల కనిపించింది. అందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితి వల్లే ఆ దిగుమతులు తగ్గాయి. కానీ, ఈ ఏడాది మాత్రం దిగుమతులు పెరగచ్చు అంటున్నారు. ముఖ్యంగా 43 ఇంచెస్ టీవీల విక్రయాలు పెరుగుతున్నాయి. అందరూ స్మార్ట్ టీవీలకు మాత్రమే కాకుండా.. కాస్త పెద్ద స్క్రీన్ కలిగిన టీవీలకు అప్ గ్రేడ్ అవుతున్నారు. ఇప్పుడు వినియోగదారులు వాడుతున్న టీవీల్లో 93 శాతం స్మార్ట్ టీవీలే ఉన్నాయి. రానున్న రోజుల్లో వందశాతం స్మార్ట్ టీవీలో ఉంటాయి. మరి.. స్మార్ట్ టీవీల ధరలు మరింత పెరగనున్నాయి అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి