iDreamPost

సంతానం లేక బాధపడుతున్నరా.. అయితే స్కంద షష్ఠి రోజున ఇలా చేయండి.. అన్నీ శుభ ఫలితాలే

  • Published Jun 08, 2024 | 1:18 PMUpdated Jun 08, 2024 | 1:18 PM

హిందూ సంప్రదాం ప్రకారం.. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి రోజున ఈ స్కంద షష్ఠి పూజను జరుపుకుంటారు. దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. అయితే ఈ స్కంద షష్ఠి రోజున ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది ఇక ఈ పూజ చేసిన వారికి ఈ సమస్యలన్నీ తొలిగిపోయి అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి. మరి ఈ పూజ ప్రత్యేకతను తెలుసుకుందాం.

హిందూ సంప్రదాం ప్రకారం.. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి రోజున ఈ స్కంద షష్ఠి పూజను జరుపుకుంటారు. దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. అయితే ఈ స్కంద షష్ఠి రోజున ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది ఇక ఈ పూజ చేసిన వారికి ఈ సమస్యలన్నీ తొలిగిపోయి అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి. మరి ఈ పూజ ప్రత్యేకతను తెలుసుకుందాం.

  • Published Jun 08, 2024 | 1:18 PMUpdated Jun 08, 2024 | 1:18 PM
సంతానం లేక బాధపడుతున్నరా.. అయితే స్కంద షష్ఠి రోజున ఇలా చేయండి.. అన్నీ శుభ ఫలితాలే

స్కంద షష్ఠి.. హిందూ సంప్రదాం ప్రకారం.. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి రోజున ఈ స్కంద షష్ఠి పూజను జరుపుకుంటారు. దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు.అయితే శివపార్వతి దేవిల ముద్దుల తనయుడు స్కందుడు అనగా కార్తికేయునికి ఆరోజున నియమ నిష్టతో పూజిస్తారు. ముఖ్యంగా ఈ పూజ అనేది దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. అయితే ఈసారి శుక్ల పక్షషష్ఠి తిథి జూన్ 11వ తేదీ అనగా మంగళవారం సాయంత్రం 5:27 గంటలకు ప్రారంభమై తిరిగి జూన్ 12వ తేదీ బుధవారం సాయంత్రం 7:17 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ పవిత్రమైన రోజున భక్తులు అందరూ ఉపవాసం పాటించి ఆ కార్తికేయు స్వామికి పూజలు చేస్తారు. ఇంతకి ఈ స్కంద షష్ఠి రోజున ఏ దేవుడికి పూజ చేస్తే మంచింది. ఇక ఈ పూజ చేసిన వారికి ఆ సమస్యలన్నీ తొలిగిపోతాయ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి రోజున ఈ స్కంద షష్ఠిని జరుపుకుంటారు. అయితే ఈ స్కంద షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. ఇక ఈసారి ఈ శుక్ల పక్షషష్ఠి తిథి అనేది జూన్ 11వ తేదీ అనగా మంగళవారం నాడు ప్రారంభమవుతుంది. కాగా, ఆరోజు హిందువులంతా ఎంతో నియామ నిష్టలతో ఆ కార్తికేయ స్వామిని పూజిస్తారు. ముఖ్యంగా ీ పూజను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా, సింగపూర్,శ్రీలంక వంటి ఇతర దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం.. ఈ స్కంద షష్ఠి రోజున ఆ కార్తికేయ స్వామితో పాటు సూర్య భగవానుని కూడా పూజించే రోజుగా పరిగణిస్తారు. కనుక ఆ రోజున హిందువులందరూ.. సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి లభించి, ఆరోగ్యం, ఆనందం, సంపదను పొందుతారు.

ముఖ్యంగా ఎప్పటి నుంచే సంతానం లేక బాధపడుతూ.. సంతానం కోసం ఎదురుచూసే వారు ఈరోజున షష్ఠి వత్రాన్ని ఆచరిస్తే.. త్వరలోనే శుభవార్త వింటారు. కచ్చితంగా సంతానం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామంది హిందువులు ఈ స్కంద షష్ఠి వ్రతాన్ని ఉపవాసంతో పాటిస్తారు. అలా పాటించడం వలన సంతానం లేని దంపతులు పిల్లలు పొందుతారని నమ్మకం.అంతేకాకుండా దురాశ, కోపం, అహంకారాల నుంచి విముక్తి పొందడమే కాకుండా మంచి ఆరోగ్యం, సంపద, విజయం పొందతారని భక్తులు నమ్ముతారు. అయితే ఆ స్కంద షష్ఠి రోజుు ప్రతిఒకక్రూ ఇలా చేస్తే అన్ని సమస్యలు తొలిగి శుభ ఫలితాలు పొందుతారు.

కాగా, ముందుగా స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన ఆ తర్వాత.. ఆ సూర్య  భగవాడుని స్మరించి.. పూజ చేస్తారు. ఇక ఆ సూర్యుడికి సంబంధించి మంత్రాలను జపించిన ఆనంతరం వినాయకుడుతితో పాటు నవగ్రహాలను పూజించాలి. అనంతరం కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్టించి షోడశోపచార పద్ధతిలో పూజించాలి. ఇక ఆ తర్వాత ఆ కార్తికేయ స్వాని ప్రసన్నం చేసుకొని  “ఓం స్కంద శివాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. అలాగే,స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు, ఆభరణాలు, సువాసనలు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన వాటిని సమర్పించాలి. ఇక ఇక నియమ నిష్టలతో చేసిన పూజ అనంతరం ఆ స్వామి వారికి హారతిని ఇవ్వాలి. అయితే ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేస్తే ఆ కార్తికేయుడి అనుగ్రహం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి