iDreamPost
android-app
ios-app

మహేష్ బాబును మించి సితార యాడ్ రెమ్యునరేషన్! ఒక్క యాడ్ కు ఎంత తీసుకుందంటే?

  • Author Soma Sekhar Published - 12:11 PM, Thu - 6 July 23
  • Author Soma Sekhar Published - 12:11 PM, Thu - 6 July 23
మహేష్ బాబును మించి సితార యాడ్ రెమ్యునరేషన్! ఒక్క యాడ్ కు ఎంత తీసుకుందంటే?

ఏదైనా రంగంలో తండ్రికి తగ్గ వారసులుగా రాణించాలంటే చాలా కష్టం. ఎందుకంటే వారిపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది కనక. తల్లిదండ్రుల క్రేజ్ ఏదైనా రంగంలోకి అడుగుపెట్టేంత వరకే గానీ.. ఆ రంగంలో విజయం సాధించాలంటే అంతో ఇంతో టాలెంట్ ఉండాలి. ప్రస్తుతం అలాంటి టాలెంట్ తోనే తండ్రికి తగ్గ కూతురిగా దూసుకుపోతోంది సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి సితార. తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ లో సితార జ్యూవెల్లరి యాడ్ వీడియోను ప్రదర్శించారు. దాంతో మహేష్ సాధించని ఘనతను సితార సాధించి రికార్డు నెలకొల్పింది. అయితే ఈ యాడ్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుందట. దాంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఈ ఘట్టమనేని యువరాణి. మరి సితార తన ఫస్ట్ యాడ్ కు ఎంత డబ్బులు తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఘట్టమనేని సితార.. సూపర్ స్టార్ మహేష్-నమ్రతల గారాల పట్టిగా ఇండస్ట్రీకి సుపరిచితమే. అయితే తన తల్లిదండ్రుల క్రేజ్ ను వాడుకోకుండా.. తన ఓన్ టాలెంట్ తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ.. తన డ్యాన్స్ తో అభిమానులను చేసుకుంది సితార. తాజాగా ఓ జ్యూవెల్లరీ యాడ్ లో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ యాడ్ ను ఇటీవలే న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ లో పై ప్రదర్శించారు. దాంతో సితారకు ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. అయితే ఈ యాడ్ లో యాక్ట్ చేసినందుకు సితారకు ఏకంగా రూ.కోటి రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. దాంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఈక్రమంలోనే మహేష్ బాబు తన తొలి యాడ్ కు కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుని ఉండడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ అటు సినిమాలతో పాటుగా ఇటు యాడ్ షూట్స్ తో నటిస్తూ.. గట్టిగానే సంపాదిస్తున్నాడు. ఇక మహేష్ ఒక్క యాడ్ కు కోట్లలోనే తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక తన కూతురు సాధించిన ఘనతను ట్విట్టర్ ద్వారా తెలియపరిచి.. తన సంతోషాన్ని పంచుకున్నాడు సూపర్ స్టార్. మరి సితార చిన్న వయసులోనే అంత మెుత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetlunabetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş