iDreamPost

సిట్ చీఫ్ రఘురామిరెడ్డి ట్రాక్ రికార్డ్ అదుర్స్

సిట్ చీఫ్ రఘురామిరెడ్డి ట్రాక్ రికార్డ్ అదుర్స్

SIT చీఫ్ గా నియమితులయిన ఇంటలిజెన్స్ DIG డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి ట్రాక్ రికార్డ్ అదుర్స్

2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ రఘునాథ్‌ రెడ్డి. కాకినాడలో టెన్త్‌క్లాస్‌ పూర్తి చేసుకున్నాడు. ఉస్మానియా కాలేజీలో MBBS చదివారు.

వైట్‌ కాలర్‌ అక్రమాల్ని తవ్వి, ఏ ఒత్తిళ్లకూ లొంగకుండా వ్యవహరించడంలో ఈయనకు తిరుగులేని ట్రాక్‌ రికార్డు ఉంది. ఇలాంటి కేసుల్లో రఘునాథ్‌రెడ్డి కరోడా టైపు.

(అమరావతి రాజధాని అక్రమాలే కాకుండా.. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై శుక్రవారం రాత్రి ( 21 ఫిబ్రవరి 2020)న ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది.

ఏ స్థాయి అధికారినైనా పిలిచి విచారించే అధికారం ఈయనకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇతర దర్యాప్తు సంస్థలను కూడా సమన్వయం చేసుకునే అధికారం రఘునాథ్‌ రెడ్డికి కట్టబెట్టింది.)

ఆర్థిక నేరాలను కట్టడి చేయడంలో ఈయనది అందెవేసిన చేయి. ఒక సారి దృష్టి సారించి ఫైల్‌ ప్రిపేర్‌ చేశాడంటే ఇక దబిడి.. దిబిడే అనేది ప్రభుత్వ అధికారుల మాట.

Amway ఇండియా అక్రమాలపై మిలియన్‌ స్కాట్‌ పిక్నీ చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాడు.

స్కాట్‌ పిక్నీ ఆటలు ఐపీఎస్‌ రఘునాథ్‌ రెడ్డి వద్ద సాగలేదు. గుర్గాం వెళ్లి మరీ ఆయన్ను అరెస్టు చేశాడు.

గోపాల్‌ షెకావత్‌… ఎన్‌మార్ట్‌ కంపెనీకి బాస్‌. డబ్బుతో ఏదైనా కొనేస్తాననే టైపు. ఆమ్వే సీఈవో స్కాట్‌ పిక్నీ లాగే లొసుగులను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు.

ఎస్పీ రఘునాథ్‌ రెడ్డి వద్ద గోపాల్‌ షెకావత్‌ ఎత్తులు సాగలేదు. తీసుకొచ్చి జైళ్లో పడేశాడు.

పోంజీ స్కాములైన నక్షత్ర, అక్షయ గోల్డ్‌ వంటి స్కాములను కూడా రఘునాథ్‌ రెడ్డి సమర్థవంతంగా డీల్‌ చేశారు.

ఇలాంటి నిజాయతీపరుడైన అధికారిని 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాడు.

ఇప్పుడు చంద్రబాబు బ్యాచ్‌ అధికారంలో ఉన్నపుడు చేసిన అక్రమాలపై వేసిన సిట్‌కు ఆయన్ను విచారణాధికారిగా ముఖ్యమంత్రి జగన్‌ నియమించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి