iDreamPost
android-app
ios-app

OTTలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ! సైనికుడా..దేశ ద్రోహా?

  • Published Apr 08, 2024 | 6:39 PM Updated Updated Apr 08, 2024 | 6:39 PM

భాషతో సంబంధం లేకుండా వరుసగా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల జాబితాలో.. ఇప్పుడు ఒక బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ కూడా యాడ్ అవ్వబోతుంది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి చూసేద్దాం.

భాషతో సంబంధం లేకుండా వరుసగా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల జాబితాలో.. ఇప్పుడు ఒక బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ కూడా యాడ్ అవ్వబోతుంది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి చూసేద్దాం.

  • Published Apr 08, 2024 | 6:39 PMUpdated Apr 08, 2024 | 6:39 PM
OTTలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ! సైనికుడా..దేశ ద్రోహా?

టాలీవుడ్, బాలీవుడ్ హాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా ఒక దాని తర్వాత ఒకటి సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో విడుదల అవుతూనే ఉన్నాయి. వీటికి లభించే ఆదరణ కూడా బాగా పెరిగిపోతు ఉంది. ముఖ్యంగా వీటిలో యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా మెయిన్ లీడ్ లో నటించిని సినిమా “యోధ”. ఇది ఒక బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా మార్చి 15 న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా టీజర్ నుంచి ట్రైలర్ వరకు కూడా భారీగానే క్రేజ్ సంపాదించుకుంది. కానీ, థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుని.. ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుందంటూ.. టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

యోధ సినిమాకు.. సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీగా అంచనాలను పెంచడంతో పాటు.. ఈ సినిమా రిలీజ్ సమయంలో చేసిన ప్రమోషన్స్ కూడా అందరిని అంతే ఆకట్టుకున్నాయి. కానీ చివరకు థియేటర్ లో మాత్రం మిక్స్డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా. దీనితో కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమాకు ఎదురుదెబ్బలు తగిలాయి. యోధ సినిమా సుమారు రూ.55 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. కానీ, సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత మాత్రం సుమారు రూ.31 కోట్ల కలెక్షన్స్ తో సరిపెట్టుకుని.. కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచింది. ఇక యోధ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికొస్తే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీని గురించి మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇక యోధ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ఒక ఆర్మీ సైనికుడిగా సిద్ధార్ధ్ మల్హోత్రా కనిపిస్తాడు, ఈ సినిమాలో సిద్ధార్ధ్ తో పాటు రాశీ ఖన్నా, దిశా పటానీ కూడా ముఖ్య పాత్రలలో కనిపించారు. కాగా రోనిత్ రాయ్, తనూజ్ విర్వాణీ, సన్నీ హిందూజ, కృతిక భరద్వాజ్, ఎంఎస్ జహీర్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో సైనికుడిగా నటించిన సిద్ధార్ధ్ ఒక మిషన్ లో వైఫల్యం చెందుతాడు. దీనితో అతను సస్పెన్షన్ కు గురౌతాడు. కానీ, ఆ తర్వాత అతను ఒక హైజాక్ అయిన విమానంలో కనిపిస్తాడు. అతను సైనికుడా లేదా దేశ ద్రోహా అనేది మాత్రం ఎవరికీ అర్ధం కాదు. ఈ విషయం తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకు కథ పరంగా మిక్స్డ్ టాక్ లభించినా కూడా.. సిద్ధార్ధ్ కు మాత్రం నటన పరంగా ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş