iDreamPost

వైష్ణవి చైతన్యకు క్రేజీ ఆఫర్.. సిద్దు జొన్నలగడ్డ పక్కన నటించే ఛాన్స్?

  • Author singhj Published - 04:22 PM, Wed - 13 September 23
  • Author singhj Published - 04:22 PM, Wed - 13 September 23
వైష్ణవి చైతన్యకు క్రేజీ ఆఫర్.. సిద్దు జొన్నలగడ్డ పక్కన నటించే ఛాన్స్?

ఒకే ఒక్క సినిమాతో ఓవర్​నైట్ స్టార్​డమ్ తెచ్చుకున్నారు అందాల భామ వైష్ణవి చైతన్య. యూట్యూబ్​ వీడియోలు చేసుకుంటూ మంచి టాలెంట్ ఉందనే పేరు సంపాదించిన వైష్ణవి.. ‘బేబీ’ మూవీతో సెన్సేషన్ సృష్టించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో యూత్ ఆడియెన్స్​లో మంచి క్రేజ్ సంపాదించారు వైష్ణవి. అయితే ‘బేబీ’ అంత పెద్ద హిట్​గా నిలిచినా ఆమెకు ఆఫర్లు రావడం లేదని అంతా అనుకున్నారు. కానీ వైష్ణవికి మంచి ఆపర్లు వస్తున్నాయని సమాచారం. అందులో భాగంగానే ఒక క్రేజీ ఆఫర్​ ఆమెను వెతుక్కుంటూ వచ్చిందట.

టాలీవుడ్​లో తక్కువ టైమ్​లోనే స్టార్ స్టేటస్ సంపాదించిన హీరో సిద్దు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’ మూవీతో సిద్ధు యూత్ స్టార్​గా మారిపోయాడు. ఈ మూవీలో తెలంగాణ మాండలికంలో ఆయన చెప్పిన డైలాగులకు అందరూ ఫ్యాన్స్​గా మారిపోయారు. నటనతో పాటు స్టోరీ, స్క్రీన్​ప్లే, డైలాగులు రాసుకోవడంలోనూ ఈ హీరోకు మంచి టాలెంట్ ఉంది. అలాంటి సిద్దు ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్​’లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే బొమ్మరిల్లు భాస్కర్​ తెరకెక్కే మూవీలో సిద్దు జొన్నొలగడ్డ నటించనున్నారని సమాచారం. సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​లో రూపొందనున్న ఈ ఫిల్మ్​లో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్​గా నటించనున్నట్లు వినికిడి.

లవ్ స్టోరీస్​ను డీల్ చేసే బొమ్మరిల్లు భాస్కర్​తో కొత్త మూవీకి సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ఓకే చెప్పారని టాక్. గతంలో ‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్’, ‘ఒంగోలు గిత్త’ అంటూ భాస్కర్ కొన్ని ప్రయోగాలు చేశారు. వీటిలో ‘బొమ్మరిల్లు’ బ్లాక్​ బస్టర్​ అయింది. ‘ఆరెంజ్’ మ్యూజికల్​ హిట్​గా నిలవగా.. ‘ఒంగోలు గిత్త’ ఫ్లాప్ అయింది. ఆఖరుగా అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేలతో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ తీశారు భాస్కర్. ఈ సినిమా మంచి హిట్​గా నిలిచింది. ఇక, భాస్కర్, సిద్దు కాంబోలో పట్టాలెక్కనున్న మూవీలో వైష్ణవి చైతన్య పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం. ‘బేబీ’ లాంటి సూపర్​ హిట్ వచ్చినా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్న వైష్ణవికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని నెటిజన్స్ అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: ‘జవాన్’ కోసం నయన్​కు అన్ని రూ.కోట్లు ఇచ్చారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి