iDreamPost

పండుగ కోసం భర్తతో షాపింగ్.. మరసటి రోజు బావతో జంప్

కర్వాచౌత్.. ఈ పండుగను ఉత్తరాదిలో ఘనంగా చేసుకుంటారు. ముఖ్యంగా వివాహితులైన మహిళలు. ఈ పర్వదినాన భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం భార్యలు .. ఉదయం నుండి సాయంత్రం చంద్రుడు వచ్చేంత వరకు ఉపవాసం ఉంటారు. అయితే ఈ కలియుగ మహిళ ఏం చేసిందంటే..?

కర్వాచౌత్.. ఈ పండుగను ఉత్తరాదిలో ఘనంగా చేసుకుంటారు. ముఖ్యంగా వివాహితులైన మహిళలు. ఈ పర్వదినాన భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం భార్యలు .. ఉదయం నుండి సాయంత్రం చంద్రుడు వచ్చేంత వరకు ఉపవాసం ఉంటారు. అయితే ఈ కలియుగ మహిళ ఏం చేసిందంటే..?

పండుగ కోసం భర్తతో షాపింగ్.. మరసటి రోజు బావతో జంప్

ఉత్తర భారత దేశంలో పెళ్లైన మహిళలు ఇష్టంగా చేసుకునే పండుగల్లో ఒకటి కర్వాచౌత్. శరత్ పూర్ణిమ నాడు ఈ పండుగను చేసుకుంటారు మహిళలు. అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే భార్యా భర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమకు నిర్వచనంగా నిలుస్తుంది ఈ ఫెస్టివల్. భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం భార్యలు .. ఉదయం నుండి సాయంత్రం చంద్రుడు వచ్చేంత వరకు ఉపవాసం ఉంటారు. చందమామ కనిపించగానే.. దీప హారతులు తీసుకువచ్చి.. జల్లెడలో చందమామను చూసి.. ఆ తర్వాత భర్త ముఖారవిందాన్ని చూస్తుంటారు. భర్తలు కూడా భార్యలకు సర్ ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చి ఆనందంలో ముంచెత్తుతూ ఉంటారు.

ఈ పండుగ వస్తుందంటే చాలు ముందు నుండే షాపింగ్ హడావుడి ఉంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేయడం, మెహందీ దగ్గర నుండి ఆ రోజు ఇంట్లో చేసే వంటకాల వరకు అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు మహిళలు. ఈ కలియుగ భార్య మాత్రం భర్తకు ఝలక్ ఇచ్చింది. పండుగ అని భార్యా భర్తలు ఇద్దరూ షాపింగ్ చేశారు..తనకు ఇష్టమైనవన్నీ భర్తతో కొనిపించుకుంది భార్య. తీరా కర్వా చౌత్ పండుగ రాగా, ఇంట్లో కనిపించకుండా పోయింది. కుమారుడితో సహా ఉడాయించే సరికి.. వారి జాడ కనిపెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించాడు భర్త. ఆమె తన బావ వెంట వెళ్లిపోయిదంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిసౌలా గ్రామానికి చెందిన అశోక్ కుమార్.. అమ్హేదా ఆదిపూర్ గ్రామానికి చెందిన ప్రియతో 2019లో వివాహం అయింది. వీరికి విషు అనే కుమారుడు ఉన్నారు. ఫజల్ పూర్ పట్టణంలో ఉంటే అశోక్ బావ రాహుల్ తరచూ ఇంటికి వస్తూ ఉండేవారు. ఈ సమయంలో ప్రియతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి.. రాహుల్ ఇంటికి రానివ్వకుండా చేశాడు. కర్వా చౌత్ పురస్కరించుకుని భార్యను షాపింగ్‌కు తీసుకెళ్లాడు అశోక్. తనకు ఇష్టమైనవన్నీ కొనిపించుకుంది. రూ. 15 వేల విలువైన ఆభరణాలు కూడా కొన్నాడు. మరుసటి రోజు అశోక్ పనికి వెళ్లి.. ఇంటికి తిరిగి రాగా, భార్య, బిడ్డ కనిపించకపోవడంతో.. పుట్టింటికి వెళ్లిందేమోనని ఫోన్ చేసి అడగ్గా రాలేదని తెలిసింది. ఇరుగు పొరుగును అడిగితే.. రాహుల్ ఇంటికి వచ్చినట్లు చెప్పారు. దీంతో రాహుల్ భార్య, బిడ్డను తీసుకెళ్లాడని తెలిసి.. అతడి వల్ల వారికి మాన, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశముందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రాహుల్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి