iDreamPost

కొత్త కారు కొంటే ఈ నెలాఖరులోపే కొనేయండి.. కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు

కార్లు కొనాలనుకును కస్టమర్లకు కార్ల కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. కొత్త కారు కొనాలనుకునే వారు ఈ నెలాఖరులోపే కొనేయండి.

కార్లు కొనాలనుకును కస్టమర్లకు కార్ల కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. కొత్త కారు కొనాలనుకునే వారు ఈ నెలాఖరులోపే కొనేయండి.

కొత్త కారు కొంటే ఈ నెలాఖరులోపే కొనేయండి.. కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు

మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది కాలగమనంలో కలిసిపోనున్నది. కొత్త సంవత్సరం సందర్భంగా అన్ని రంగాల్లో మార్పులు చేసుకుంటాయి. ఆ మార్పులు కొన్ని లాభాలను చేకూరిస్తే, మరికొన్ని జేబులకు చిల్లు పడేలా చేస్తాయి. అయితే వాహన కొనుగోలుదారులపై ఈ ప్రభావం పడనున్నది. ముఖ్యంగా కార్ల విషయంలో ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కార్లు అంటే ఇష్టపడే వారికి బిగ్ అలర్ట్. మీరు ఈ మధ్య కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఆలస్యం చేయకండి. ఈ నెలాఖరులోపే కొత్త కారును కొనుక్కోండి. ఎందుకంటే కొత్త ఏడాది నుంచి కార్ల ధరలు మరిత పెరగనున్నాయి. ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు కార్ల ధరలు వచ్చే ఏడాది నుంచి పెంచుతామని ప్రకటించారు. కంపెనీలు కార్ల ధరలు పెంచకముందే మీరు కొనుగోలు చేయండి.

ఇటీవల మారుతీ సుజుకీ, హ్యూందాయ్, టాటా, మహీంద్రా, ఆడి వంటి బ్రాండ్లు 2024 జనవరి నుంచి ధరలు పెరుగుతాయని ప్రకటించాయి. నిర్వహణ వ్యయం, ముడి సరుకు, ఇన్ పుట్ ఖర్చులు, మెటీరియల్ ధరలు పెరగడం వల్లనే కంపెనీలు కార్ల ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఏయే కార్ల ధరలు పెరుగుతాయంటే?

బీఎండబ్య్లూ:

  • బీఎండబ్య్లూ కూడా కార్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2 శాతవ వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 220ఐ ఎమ్ స్పోర్ట్ నుంచి ఎక్స్ ఎమ్ వరకు వివిధ రకాల కార్లను సేల్ చేస్తోంది.

మారుతీ సుజుకీ:

  • మారుతీ సుజుకీ కంపెనీ కార్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కొత్త సంవత్సరం నుంచి ఈ కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ కంపెనీకి చెందిన అరెనా, నెక్సా కార్ల ధరలు 2023 చివరిలో పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ ప్రకటించింది. మారుతి కార్ల కొత్త ధరలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

హ్యూందాయ్‌:

  • మరో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యూందాయ్‌ కొత్త కార్ల ధరలు 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా లైనప్ 13 మోడళ్లను కలిగి ఉంది. వీటిల్లో కోనా ఈవీ, ఐయనిక్‌ ఈవీ వాహనాలు కూడా ఉన్నాయి.

టాటా కార్లు:

  • టాటా మోటార్స్ కూడా జనవరి 2024 నుంచి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. టాటా ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్), ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) సహా అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈవీల ధరలు కూడా పెరగనున్నాయి. పెరగనున్న వాటిల్లో టాటా టియాగో ఈవీ, టాటా టైగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ.

మహీంద్రా కార్లు:

  • మహీంద్రా కంపెనీ కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటిలో మహీంద్రా యొక్క ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400 ఈవీ కూడా ఉంది.

ఆడి:

  • లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా 2024 జనవరి నుంచి తమ అన్ని కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. దేశంలో ఆడి మొత్తం 15 మోడళ్లను సేల్ చేస్తోంది.

ఫోక్స్ వ్యాగన్ కార్లు:

  • ఫోక్స్ వ్యాగన్ కూడా కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్ కార్ల ధరలను కొత్త ఏడాది నుంచి 2 శాతం మేర పెంచనున్నట్లు తెలిపింది.

మెర్సిడేజ్ బెంజ్:

  • మెర్సిడేజ్ బెంజ్ కూడా కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. లగ్జరీ కార్లలో ఒకటైన మెర్సిడేజ్ కొత్త సంవత్సరం నుంచి కస్టమర్లకు షాక్ ఇవ్వనున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి