iDreamPost

సినిమా రివ్యూలు రాసేవాళ్లకు షాక్!.. తొమ్మిది మంది అరెస్టు.. కారణమేంటంటే?

సినిమా రివ్యూలు రాసేవాళ్లకు షాకింగ్ న్యూస్. మీకు నచ్చినట్లుగా రివ్యూ ఇస్తామంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఓ సినిమాపై రివ్యూలు ఇచ్చిన వారిపై కేసు నమోదైంది. డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో తొమ్మిది మందిపై కేసు నమోదైంది.

సినిమా రివ్యూలు రాసేవాళ్లకు షాకింగ్ న్యూస్. మీకు నచ్చినట్లుగా రివ్యూ ఇస్తామంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఓ సినిమాపై రివ్యూలు ఇచ్చిన వారిపై కేసు నమోదైంది. డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో తొమ్మిది మందిపై కేసు నమోదైంది.

సినిమా రివ్యూలు రాసేవాళ్లకు షాక్!.. తొమ్మిది మంది అరెస్టు.. కారణమేంటంటే?

సినిమా ఎంతో వ్యయప్రయాసతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒక సినిమా రూపుదిద్దుకోవాలంటే 24 క్రాఫ్ట్స్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది. కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమా కొందరు ఇచ్చే రివ్యూల వల్ల అనుకున్న స్థాయిలో ఆడక నష్టాలను తెచ్చిపెడుతోంది. చిత్ర యూనిట్ ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి అటువంటి రివ్యూలు. అయితే తాజాగా సినిమా రివ్యూలు రాసేవాళ్లకు బిగ్ షాక్ తగిలింది. ఓ సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చినందుకు ఏకంగా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. కాగా దేశంలో ఇది మొదటి కేసుగా నిలవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు రివ్యూలు రాసేందుకు రెడీ అయిపోతుంటారు కొందరు వ్యక్తులు. కాగా వారు ఇచ్చేటువంటి రివ్యూలు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్నికొన్ని సార్లు సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ రివ్యూలు రాసేస్తుంటారు. అటువంటి రివ్యూల వల్ల ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి కనబర్చరు. దీంతో ఆ సినిమా నష్టాలను తెచ్చిపెడుతుంటుంది. ఇదే విషయానికి సంబంధించి మలయాళంలో ఇటీవల విదుదలైన రాహెల్ మకాన్ కోరా చిత్ర దర్శకుడు ఉబైనీ తన సినిమాపై రివ్యూలు ఇచ్చిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్శకుడు పిర్యాదు మేరకు తన సినిమాకు నెగిటీవ్ రివ్యూ ఇచ్చిన మొత్తం తొమ్మిది మందిపై పలు సెక్షన్ ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

ఓవైపు ప్రైవసీ, మరోవైపు రివ్యూలు సినిమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో రాహెల్ మకాన్ కోరా మూవీపై యూట్యూబ్, ఫేస్‌బుక్ వేదికగా పలువురు రివ్యూలు ఇచ్చారు. అయితే ఈ రివ్యూలు నెగిటీవ్ గా ఉండడంతో సినిమాపై ప్రభావం చూపించాయి. దీనికి సంబంధించి సదరు సోషల్ మీడియా ఓనర్ లకు వ్యతిరేకంగా సాక్ష్యాలను పోలీసుల ఎదుట సమర్పించారు చిత్ర యూనిట్. ఈ కేసులో నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో ఓ డైరెక్టర్ సినిమాపై సమీక్షలను జరుపకుండా ఉండేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించాడు. విడుదలైన తేదీ నుండి కనీసం ఏడు రోజులపాటు ఎలాంటి రివ్యూలు ఇవ్వకూడదని, అది సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తుందని ఆయన పిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఈ విషయంపై సుదీర్ఘ విచారణ జరపాలని పోలీసులను కోరింది. ఫిర్యాదుదారుడి ఆరోపణలు నిజమని తేలడంతో అటువంటివారిని అరికట్టేందుకు ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇక తాజాగా చోటుచేసుకున్న ఘటనతో రివ్యూలు రాసేవాళ్లు కాస్త వెనకా ముందు ఆలోచించి రాయాల్సి ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి