iDreamPost

Shobha Shetty: ఈ వీక్ హౌస్ నుంచి శోభా శెట్టి ఎలిమినేషన్!

బిగ్ బాస్ హౌస్ లో ఆట దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ అందరూ విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆట మాత్రమే కాకుండా.. హౌౌస్ లో గొడవలు కూడా గట్టిగానే పడుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఆట దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ అందరూ విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆట మాత్రమే కాకుండా.. హౌౌస్ లో గొడవలు కూడా గట్టిగానే పడుతున్నారు.

Shobha Shetty: ఈ వీక్ హౌస్ నుంచి శోభా శెట్టి ఎలిమినేషన్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఉత్కంఠగా సాగుతోంది. పేరుకి ఫన్నీ టాస్కులు అయినా కూడా అందరూ తెగ కొట్టేసుకుంటున్నారు. పిలిచినా కూడా పిచ్చ కొట్టుడు కొట్టుకునేలా ఉన్నారు. ప్రతి సీజన్లో లాస్ట్ వీక్స్ ఎంతో ప్రశాంతంగా, సరదాగా సాగుతాయి. కానీ, ఈ సీజన్లో మాత్రం నాగార్జున వచ్చిన విన్నర్ చేయి గాల్లోకి లేపేదాకా కూడా ఈ కొట్లాటలు ఆగేలా లేవు. రెండు గ్రూపులుగా విడిపోయి స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ పొరపొచ్చాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడియన్స్ లో కొంతమందికి ఒక శుభవార్త అందింది. ఈ వార్త కోసం చాలామంది రెండు వారాలుగా ఎదురుచూస్తున్నారు. అదేంటంటే.. శోభా శెట్టి హౌస్ నుంచి ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 నిజానికి శోభాశెట్టి చాలా స్ట్రాంగ్ ప్లేయర్. లేడీ సింగంలాగా అన్నీ టాస్కుల్లో తన బెస్ట్ ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ కోసం స్టాండ్ తీసుకుంటే ఎదురు ఎవరున్నా వెనక్కి తగ్గే రకం కాదు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మాస్కు లేకుండా గేమ్ ఆడుతోంది. బయట అందరూ ఎలాగైతే కోపం వస్తే అరుస్తారు.. బాధేస్తే ఏడుస్తారు.. ఆనందం వస్తే గంతులేస్తారు. అలాగే శోభా కూడా తన ఎమోషన్స్ ని ట్రూగా చూపించింది. కోపం, బాధ, స్నేహం, అలక అన్నీ కూడా కంటెస్టెంట్ లా కాకుండా ట్రూ ఎమోషన్స్ ని చూపించింది. అయితే కొన్ని సందర్భాల్లో ఆడియన్స్ కి విసుగు, చిరాకు తెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఫ్యామిలీ వీక్ సమయంలో తల్లి వచ్చి సర్దిచెప్పిన తర్వాత శోభా తన ప్రవర్తనను మార్చుకుంది. కానీ, అది కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత మళ్లీ కేకలు వేయడం, అలగడం, ఓడిపోతే ఏడవడం చేసింది. కొన్ని విషయాల్లో తనకు సంబంధం లేకపోయినా కూడా కలగజేసుకోవడం చేసింది. అంతేకాకుండా కొన్నిసార్లు ఫ్రెండ్స్ కోసం ఫౌల్ గేమ్ ని యాక్సెప్ట్ చేయడం, తన ఫ్రెండ్స్ మాత్రమే గెలవాలి అన్న తరహాలో నిర్ణయాలు తీసుకోవడం కూడా బ్యాక్ ఫైర్ అయ్యింది. మరీ ముఖ్యంగా గడిచిన రెండు వారాల నుంచి శోభా మీద నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. అదేంటో.. ఈ వీక్ తానే ఎలిమినేట్ కాబోతున్నాను అనే విషయాన్ని శోభా కూడా గ్రహించింది. అందుకే వెళ్లేలోపు శివాజీ అసలు రంగుని బయటపెడతా అంటూ కామెంట్స్ కూడా చేసింది. అయితే ఈ వీక్ హౌస్ నుంచి శోభాశెట్టినే ఎలిమినేట్ అయినట్లు లీకులు వస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో శోభా పేరు బాగా వైరల్ అవుతోంది. ఆమె హౌస్ నుంచి ఈ వీక్ బయటకు వచ్చేస్తోంది అంటూ బలంగా చెబుతున్నారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ తో పోలిస్తే శోభా శెట్టి ఇప్పుడు కాస్త వీక్ ప్లేయర్ అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పైగా పెరిగిపోయిన నెగిటివిటీ కూడా ఆమె ఎలిమినేషన్ కారణంగా చెబుతున్నారు. రీసెంట్ వీక్స్ లో ఫ్రెండ్స్ తో కూడా శోభాకి గొడవలు జరిగాయి. ప్రియాంక- అమర్ తో కూడా ఆమె గొడవ పడింది. ఇవన్నీ ఆమెపై నెగిటివిటీని మరింత పెంచాయంటున్నారు. మరి.. ఈ వీక్ హౌస్ నుంచి శోభాశెట్టి ఎలిమినేట్ కాబోతోందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి