iDreamPost

Shashank Singh: ఇద్దరు టీమిండియా ప్లేయర్లు శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఆడారని మీకు తెలుసా?

పంజాబ్ కింగ్స్ నయా సంచలనం శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఇద్దరు టీమిండియా వెటరన్ ప్లేయర్లు ఆడారని మీలో ఎంత మందికి తెలుసు? ప్రస్తుతం వారు ఐపీఎల్ లో కూడా ఆడుతున్నారు. మరి ఆ స్టార్ ప్లేయర్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

పంజాబ్ కింగ్స్ నయా సంచలనం శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఇద్దరు టీమిండియా వెటరన్ ప్లేయర్లు ఆడారని మీలో ఎంత మందికి తెలుసు? ప్రస్తుతం వారు ఐపీఎల్ లో కూడా ఆడుతున్నారు. మరి ఆ స్టార్ ప్లేయర్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

Shashank Singh: ఇద్దరు టీమిండియా ప్లేయర్లు శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఆడారని మీకు తెలుసా?

శశాంక్ సింగ్.. ఐపీఎల్ 2024 సీజన్ లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అనుకోకుండా టీమ్ లోకి వచ్చిన ఇతడు.. తన బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. తాజాగా గుజరాత్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఓడిపోయే మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. అయితే శశాంక్ కెప్టెన్సీలో ఇద్దరు టీమిండియా స్టార్ ప్లేయర్లు ఆడారని మీకు తెలుసా? వారు ఎవరంటే?

గుజరాత్ టైటాన్స్ నుంచి మ్యాచ్ ను లాక్కొని.. పంజాబ్ కింగ్స్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు శశాంక్ సింగ్. తొలి మ్యాచ్ లో ఆకట్టుకున్న ఈ ప్లేయర్.. రెండో మ్యాచ్ లో తానెంత ప్రమాదకారో తెలియజేస్తూ.. ప్రత్యర్థి టీమ్స్ కు హెచ్చరికలు పంపాడు. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ లో శశాంక్ కేవలం 29 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 రన్స్ చేసి గుజరాత్ నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఇద్దరు టీమిండియా స్టార్ క్రికెటర్లు ఆడారని మీలో ఎంత మందికి తెలుసు? ఇంతకీ ఆ ప్లేయర్లు ఎవరంటే?

ఇటీవల ముంబై వేదికగా డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో గ్రూప్ బి టీమ్ కు 32 ఏళ్ల శశాంక్ సింగ్ సారథ్యం వహించాడు. ఇక ఇతడి కెప్టెన్సీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్ లు ఆడారు. వీరిద్దరే కాకుండా ఆయుష్ బదోని కూడా ఆడాడు. కానీ ఐపీఎల్ కు వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ప్రస్తుతం ఆడుతున్నాడు శశాంక్. నాటకీయ పరిణామాల మధ్య జట్టులోకి వచ్చిన ఇతడు పంజాబ్ కు వరంలా మారాడు. పొరపాటున ఇతడిని బేస్ ప్రైస్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్.

ఇదికూడా చదవండి: రేపటి RCB vs RR మ్యాచ్‌లో ఒక్కో సిక్స్‌తో ఆరేసి ఇళ్లకు ఉచిత విద్యుత్‌! IPLకే హైలెట్‌..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి