iDreamPost

చూడటానికే స్వీటు.. చదువుకునే రోజుల్లోనే ప్రిన్సిపాల్‌కి వార్నింగ్ ఇచ్చాడంట!

ఓటీటీలో దూసుకెళుతున్న ఎంటర్ టైన్ మెంట్ షో ఉస్తాద్.. ర్యాంప్ ఆడిద్దాం. మంచు వారబ్బాయి, హీరో మనోజ్ దీనికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. యంగ్ హీరోలను షోకు గెస్టులుగా తీసుకు వచ్చి.. వారితో ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా శర్వానంద్ వచ్చాడు.

ఓటీటీలో దూసుకెళుతున్న ఎంటర్ టైన్ మెంట్ షో ఉస్తాద్.. ర్యాంప్ ఆడిద్దాం. మంచు వారబ్బాయి, హీరో మనోజ్ దీనికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. యంగ్ హీరోలను షోకు గెస్టులుగా తీసుకు వచ్చి.. వారితో ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా శర్వానంద్ వచ్చాడు.

చూడటానికే స్వీటు.. చదువుకునే రోజుల్లోనే ప్రిన్సిపాల్‌కి వార్నింగ్ ఇచ్చాడంట!

ఇప్పుడు ఓటీటీల వేదికగా సినిమాలు, వెబ్ సీరిస్సులే కాదూ.. పలు గేమ్ షోస్, ప్రోగ్రామ్స్ అలరిస్తున్నాయి. దీని కోసం స్టార్ హీరోస్ రంగంలోకి దిగడం విశేషం. బాలకృష్ణ అన్ స్టాపబుల్, ప్రదీప్ మాచిరాజు సర్కార్, విశ్వక్ సేన్ ఫ్యామిలీ ధమాకా అంటూ అలరించాడు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ ద్వారా ర్యాంప్ ఆడించేందుకు వచ్చేశాడు మన మంచు వారబ్బాయి, సొట్ట బుగ్గల సుందరాంగుడు, హీరో మంచు మనోజ్. ఆ ఓటీటీలో ఉస్తాద్ అనే షోకి యాంకరింగ్ చేస్తున్నాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోలను గెస్టులుగా తీసుకు వచ్చి.. వారిని రోస్ట్ చేసేస్తున్నాడు. ఆడించడమోమో కానీ, అతడి యాంకరింగ్‌తో హీరోలను ఆడేసుకుంటున్నాడు.

తన ఫన్నీ యాంకరింగ్‌తో, కౌంటర్స్‌తో షో ఆసాంతం నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడు మంచు మనోజ్. ఇప్పటికీ ఈ షో ఎంతో సక్సెస్ అయ్యింది. నాని, రవితేజ, సందీప్ కిషన్, ఆది పినిశెట్టి, రానా, సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్, రవితేజ వంటి స్టార్ వచ్చి మెస్మరైజ్ చేశారు. వాళ్లతో ఎన్నో విషయాలు బయటకు వచ్చేలా చేశాడు మంచు మనోజ్. తాజాగా శర్వానంద్ ఈ షోకు విచ్చేశారు. ఈ సందర్భంగా వీడియో రిలీజ్ చేయగా..  వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్.. ఫిబ్రవరి 8 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శర్వాను తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు మంచు మనోజ్. కాగా, ఈ సందర్భంగా శర్వానంద్ పలు విషయాలను పంచుకున్నాడు. రామ్ చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం తనకు అదృష్టమని పేర్కొన్నాడు.

కాలేజీలో ఉన్నప్పుడు చేసిన అల్లరి పనులు గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్‌కే వార్నింగ్ ఇచ్చావంట కదా అని అడిగే సరికి శర్వా.. ఇలా చెప్పాడు. ‘నేను చదువుకునేటప్పుడు ఒకసారి ఏబీవీపీ వాళ్లు బంద్ ప్రకటించారు. అన్నీ కాలేజీలు మూసేశారు. మా కాలేజీ తప్ప. ఎవరొస్తారులే అని మా ప్రిన్సిపాల్.. కాలేజీ మూసేయలేదు. చాలా సేపు చూశాం కానీ ఎవ్వరూ రాలేదు. మా కాలేజ్ బయట ఉండే ఫోన్ బూత్ దగ్గరకు వెళ్లి మా ప్రిన్సిపాల్‌కి ఫోన్ చేసి.. ఏబీవీపీ వాళ్లం కాలేజీ ఓపెన్ చేశారని తెలిసింది. అరగంటలో మూసేయ్యకపోతే అద్దాలన్నీ పగలిపోతాయి అని వార్నింగ్ ఇచ్చి వచ్చేశాం. ఇక స్టూడెంట్స్ అంతా ఏబీవీపీ వాళ్లు వస్తున్నారంట అంటూ పరుగులు పెట్టారు. కాలేజీ ఆ రోజు మూసేశారు. మేమే ఫోన్ చేశామని ఎవరికీ తెలియదు. అలాగే ఓసారి ఇంటర్‌లో ఉండగా.. చరణ్, నేను కిటికీ స్క్రూలు పీకేసి ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చేసి ఎంజాయ్ చేసేవాళ్లం’ అంటూ చిలిపి సంఘటనల గురించి చెప్పాడు శర్వానంద్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి