iDreamPost

పోటీ నుంచి తప్పుకున్న షర్మిల.. ఆ పార్టీకే మద్దతు

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధినేత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పష్టం చేశారు

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధినేత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పష్టం చేశారు

పోటీ నుంచి తప్పుకున్న షర్మిల.. ఆ పార్టీకే మద్దతు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో గెలుపు లక్ష్యంగా ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్సార్టీపీ. అయితే గత కొంత కాలంగా ఈ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఊగిసలాడ నెలకొంది. గతంలో ఈ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో మంతనాలు కూడా జరిగాయి. అయితే ఎక్కడో ఈ కార్యాచరణకు బ్రేకులు పడ్డాయి. అంతలోనే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సమయంలో వైఎస్సార్టీపీ ఒంటరిగా పోరు చేస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు వైఎస్పార్టీపీ అధినేత షర్మిల.

తెలంగాణలోని పాలేరు నియోజక వర్గం నుండి షర్మిల పోటీ చేస్తారని భావిస్తున్న వేళ.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చే సిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇది అంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. ఈ సమయంలో అధికార బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. నిరుద్యోగం, పేపర్ లీక్, ఎగ్జామ్స్ రద్దు వంటి వైఫల్యాలు బీఆర్ఎస్ అధికారంలో జరిగాయన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. ఈ సారి కాంగ్రెస్ ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపించి.. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం వ్యక్తిగతంగా తనకు కూడా చాలా కష్టమని చెప్పారు.

‘ఈ పోటీలో చేస్తానని, ఎమ్మెల్యే అవుతానని, తనతో నడిచిన నాయకులు కూడా పోటీ చేస్తారని అనుకున్నారు. 3800 కిలో మీటర్ల పాదయాత్ర, 45 రోజుల నిరాహార దీక్ష, పోరాటాలు చేసిన తర్వాత.. ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మేము తీసుకుంటున్న ఈ నిర్ణయం.. తమ పార్టీలోని చాలా మందికి బాధ కలిగించే విషయయం. కేవలం తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగం ఇదని’ అన్నారు. వైఎస్సార్టీపీ  తీసుకున్నఈ నిర్ణయాన్ని పార్టీ నేతలు ఏకీభవిస్తారని నమ్ముతున్నానని అన్నారు. ఈ రెండు సంవత్సరాలుగా తన గురించి పార్టీ నేతలకు తెలుసునని, తనను దగ్గర నుండి, కష్టాన్ని, మనస్సును ఎరిగిన వాళ్లని..తాను నమ్ముతున్నానని, కొంత మంది తనను ఏకీభవించకపోయినా.. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. తాను మోసం చేశానని భావిస్తే.. క్షమించండని కోరారు. అన్నిటికి ఓ సమయం ఉంటుందని పేర్కొన్నారు. యుద్దం చేసేందుకు, విశ్రమించేందుకు ఓ సమయం ఉంటుందని, మనం యుద్దం చేసే సమయం ఇంకా రాలేదని.. ఆ రోజు వస్తుందని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి