iDreamPost

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న వరల్డ్ క్లాస్ క్రికెటర్! వచ్చే ఎన్నికల్లో పోటీ..

  • Author Soma Sekhar Published - 08:42 AM, Tue - 21 November 23

స్టార్ ఆల్ రౌండర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్ రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్దమవుతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టార్ ఆల్ రౌండర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్ రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్దమవుతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 08:42 AM, Tue - 21 November 23
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న వరల్డ్ క్లాస్ క్రికెటర్! వచ్చే ఎన్నికల్లో పోటీ..

సినిమా, క్రీడా, రాజకీయ రంగాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇండస్ట్రీలో తమదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న ఎందరో నటీ, నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా తమ మార్క్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇటు క్రీడా రంగాల్లో రాణించిన దిగ్గజాలు సైతం రాజకీయాల్లోకి సై అంటూ దూకుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు పాలిటిక్స్ లోకి దిగి రాణిస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరో స్టార్ ఆల్ రౌండర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్దమవుతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్. ఈ స్టార్ ఆల్ రౌండర్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లుగా జోరుగా అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయాలని షకీబ్ భావిస్తున్నాడట. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ అవామీ లీగ్(BAL)పార్టీ తరఫున బరిలోకిగి దిగేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆ పార్టీ తరఫున మూడు సెట్ల నామినేషన్ పత్రాలను షకీబ్ తీసుకున్నట్లు బీఏఎల్ పార్టీ సంయుక్త కార్యదర్శి బహుద్దిన్ నసీమ్ ధృవీకరించారు. “షకీబ్ ఒక సెలబ్రిటీ, స్టార్ క్రికెటర్ ఇక అతడికి బంగ్లా యువతలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేయనున్నాడు” అని నసీమ్ బంగ్లాలోని ఓ న్యూస్ ఛానల్ తో చెప్పుకొచ్చారు.

అదీకాక షకీబ్ అభ్యర్థిత్వాన్ని స్వయంగా బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ధృవీకరించడంతో.. అతడి పొలిటికల్ ఎంట్రీకి రంగం ఖరారు అయినట్లే అని అక్కడి క్రీడా, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. అయితే ఈ విషయంపై షకీబ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ బంగ్లా స్టార్ ఆల్ రౌండర్. ఈ మెగాటోర్నీలో బంగ్లా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. మరి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమవుతున్న షకీబ్ అల్ హసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి