iDreamPost
android-app
ios-app

Shakhahaari OTT: OTT లోకి సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే !

  • Published May 24, 2024 | 11:28 AM Updated Updated May 24, 2024 | 11:38 AM

ఓటీటీ లోకి కొత్త కథలు వచ్చేస్తున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్స్ తో పాటు.. ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీ లవర్స్ ను మెప్పించేందుకు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

ఓటీటీ లోకి కొత్త కథలు వచ్చేస్తున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్స్ తో పాటు.. ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీ లవర్స్ ను మెప్పించేందుకు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

  • Published May 24, 2024 | 11:28 AMUpdated May 24, 2024 | 11:38 AM
Shakhahaari OTT: OTT లోకి సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే !

ఈ వారం ఓటీటీ మూవీ లవర్స్ ను మెప్పించేందుకు కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు వచ్చేశాయి. ఈ వారం అన్ని వారల కంటే స్పెషల్ ఎందుకంటే.. థియేటర్ లో ఆయా సినిమాలు రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా గడవకముందే.. ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేశాయి. దీనితో ఈ ఓటీటీ లవర్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇక ఈ సినిమాలు చాలవన్నట్లు.. మూవీ లవర్స్ కోసం ఇంకా కొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. కాబట్టి ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కు ఎక్కడ లోటు చేయకుండా కొత్త కంటెంట్ తో సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ఏంటో ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మధ్య కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చూస్తాము అనే ప్రేక్షకులైతే లేరు, ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ కావాలంటే.. లాంగ్వేజ్ బారియర్ ఉండకూడదనే లాజిక్ ను ప్రేక్షకులు క్యాచ్ చేశారు. కాబట్టి ఇతర భాషల సినిమాలైనా సరే.. కథ బావుంటే మాత్రం ఆయా సినిమాలకు పాపులారిటీ బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ లిస్ట్ లో యాడ్ అయిపొయింది, ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయేది ఓ కన్నడ సినిమా.. ఈ సినిమా పేరు “శాఖాహారి”. ఇది చిన్న సినిమాగా థియేటర్ లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కోటి రూపాయల బడ్జెట్ లోపు తెరకెక్కిన ఈ సినిమా దాదాపు దానికి ఐదింతలు లాభాన్ని తెచ్చిపెట్టింది. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది, కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ మూవీ కూడా యాడ్ అయిందన్నమాట.

మరి శాఖాహారి సినిమా కథ విషయానికొస్తే.. సుబ్బన్న అనే వ్యక్తి ఓ చిన్న హోటల్ లో శాఖహర హోటల్ నడుపుతూ ఉంటాడు. అతనికి ఇంకా పెళ్లి అవ్వదు. ఎలాంటి రిలేషన్స్ లేకుండా ఒంటరిగా జీవితాన్నిగడపాలని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని జీవితంలోకి వినయ్ అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు, అతను అప్పటికే తన భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉంటాడు. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకుని.. అతని సుబ్బన్న హోటల్ లో తలదాచుకుంటాడు. దీనితో వినయ్ ను వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు.. విచిత్రంగా సుబ్బన్న గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. సుబ్బన్న గురించి పోలీసులకు తెలిసిన విషయాలు ఏంటి ? సుబ్బన్నకు గతంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా ? వినయ్ తన భార్యను ఎందుకు హత్య చేస్తాడు ?ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişJojobet GirişCasibomcasibom girişholiganbettaraftarium24madridbet girişmadridbet girişmadridbetJojobet Girişkatla